Followers

సాగునీరు సరఫరాకు అన్నిరకాల చర్యలు

 సాగునీరు సరఫరాకు అన్నిరకాల చర్యలు

పెన్ పవర్,కరప

రబీ చివరిదశకు చేరుకుందని, ఈ సమయంలో సాగునీటి ఎద్దడి లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఇరిగేషన్ శాఖ డీఈఈ ఆకెళ్ల రవికుమార్ అన్నారు. మండల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ఏఈఈ ఖండవిల్లి సుబ్బారావుతో కల్సి కరప, వేములవాడ, కూరాడ తదితర గ్రామాల్లో పర్యటించి, సాగునీటి సరఫరాను పర్యవేక్షించి, సూచనలు చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరందేలా వంతులవారీ విధానం అమలుచేస్తున్నామన్నారు. శివారు ఆయకట్టు కూడా నీరందేలా అవసరమైతే ఇంజన్ల ద్వారా తోడుకునేందుకు డీజిల్ సరఫరా చేస్తున్నామన్నారు పంటకాలువల నుంచి రైతులు ఎవరూ ఇంజన్లతో నీటిని తోడకూడదన్నారు. మురుగుకాలువలలోని నీటిని ఇంజన్లతో తోడుకోవాలన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో 12 చోట్ల రైతులు ఇంజన్ల ద్వారా తోడుకుంటున్నారని, నిబంధనల మేరకు వారికి డీజిల్ సరఫరా చేయడం జరుగుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...