రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఎన్నికలను తిరస్కరిస్తున్నం
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో విశ్వబ్రాహ్మణ రాష్ట్ర ఎలక్షన్ లను రిజిస్ట్రేషన్ నెంబర్ 1217/2016 మాతృ సంఘం పేరిట రిజిస్ట్రేషన్ నెంబర్ 84/2021 ఐక్య సంఘం పేరిట జరుగుతున్న ఎలక్షన్లు క్రమబద్ధంగా లేవని గత 2016లో మండల స్థాయి ఎలక్షన్లు జరగగా అప్పుడు ఎన్నుకోబడ్డ నాయకులు గ్రామస్థాయి నుంచి సర్వే చేపించి గుర్తింపు కార్డులు ఇప్పిస్తానని చెప్పి, గుర్తింపు కార్డుల తోనే మునుముందు ఎలక్షన్లకు వెళ్తామని చెప్పి మరియు ఎక్కడైనా వృత్తిపరంగా కూడా పనికొస్తాయి, అని చెప్పి 2021 వరకు కూడా ఎలాంటి గుర్తింపుకార్డులు కార్యక్రమం చేపట్టక గ్రామ స్థాయి నుండి కానీ, మండల స్థాయి నుండి కానీ, జిల్లా స్థాయి నుండి గాని, ఎలాంటి సర్వే చేయకుండానే రాష్ట్రంలో ఈ రెండు సంఘాలు ఎలక్షన్లకు పోయి, వారు ఈ ఎలక్షన్ల రూపంలో వచ్చే నామినేషన్ల డబ్బులకు కక్కుర్తి పడి ఎలక్షన్లకు ముందుకెళ్లాలని ఈ ఎలక్షన్లలో విధివిధానాలు కరెక్ట్ గా లేనందున అందుకే ఈ ఎలక్షన్ లను బహిష్కరిస్తున్నామని ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరుపున బహిష్కరించి ఈనెల 25-03-2021న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్టార్ ఫంక్షన్ హాల్ లో మండల విశ్వబ్రాహ్మణ సంఘం సభ ఏర్పాటు చేసి అక్కడే ఎలక్షన్ నిర్వహించి అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడు ని కార్యదర్శిని ఉపకార్యదర్శి కోశాధికారి ఎన్నుకుంటామని మండల విశ్వబ్రాహ్మణ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం చారి, ఆంజనేయుడు చారి, శ్రీనివాస్ చారి, కిషన్ చారి, రాజేశం చారి, దేవరాజు చారి, శంకర్ చారి, శ్రీనివాస్ చారి, వేములవాడకు చెందిన శాస్త్రి చారి, వేణుగోపాల్ చారి, ధర్మ చారి, చంద్రశేఖర్ చారి, ప్రవీణ్ చారి, నవీన్ చారి, మరియు ఎల్లారెడ్డిపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment