నేడే పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్
పెద్దాపురం,పెన్ పవర్
పెద్దాపురం పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ ప్రత్యేక అధికారి మరియు ఆర్డిఓ ఎస్ మల్లిబాబు తెలిపారు శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్ డి ఓ విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని దీనికి సంబంధించి 8 టేబుల్స్ ఏర్పాటు చేశామని, నాలుగు రౌండ్లు ద్వారా కౌంటింగ్ పూర్తి అవుతుందని తెలిపారు . ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
కౌంటింగ్ సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్ లకు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకమైన కౌంటింగ్ పాసులు జారీ చేశారని చెప్పారు. గుర్తింపు పొందిన ఐడి కార్డు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ హలు లోప్రవేశం ఉంటుందని చెప్పారు. సెల్ ఫోన్లు కానీ ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు గాని కౌంటింగ్ హాల్లోకి అనుమతించమని తెలిపారు . మీడియ సెంటర్ ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ కు సమాచారం అందజేయడం జరుగుతుందని తెలిపారు డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకుచర్యలు తీసుకున్నామని ఆర్డిఓ తెలిపారు.


No comments:
Post a Comment