జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలలో కరోనా కలకలం
గుడిహత్నూర్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీఎస్ ఎస్ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పాఠశాలలోని 8 మంది ఉపాద్యాయులకు పాజిటివ్ రావడంతో మండలం మొత్తం ఉలిక్కిపడుతోంది. బుధవారం ఒక ఉపాధ్యాయునికి పాజిటివ్ రావడం తో ఈ రోజు పాఠశాలలోని 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది మరియు 40 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా 7 గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ అని తేలింది.దీనితో నేటి నుండి సోమవారం వరకు 5 రోజుల పాటు సెలవు ప్రకటించిన మండల విద్యాధికారి తెలిపారు.

No comments:
Post a Comment