సూడో పోలీసుల అరెస్టు రిమాండ్.. పేకాట వ్యసనం..కటకటాల పాలు చేసింది..
మేడ్చల్ పట్టణంలో సూడో పోలీసుల హల్ చల్..డమ్మీ తుపాకీతో బెదిరించి నగదు దోచుకెళ్ళిన 6 గురు సూడో పోలీసులు..
ఈనెల 14వ తేదీన ఆర్ ఆర్ ఓలాడ్జ్ లో డమ్మీ గన్ తో బెదిరింపులు..డిసిపి పద్మజ.. ఒక డమ్మి రివాల్వర్, ఫైబర్ లాఠీ, జంగిల్ ష్యూస్,పోలీస్ క్యాప్,2,22,000 నగదు స్వాదీనం..
పెన్పవర్,
మేడ్చల్
మేడ్చల్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14వ తేదీన పోలీసులమని చెప్పి లాడ్జీలో పేకాట ఆడుతున్న ఇందుగల మణికంఠ, శ్రీహరి, సాయి సాంగ్ అనే ముగ్గురు వ్యక్తుల పై పోలీసులమని ఆరుగురు దుండగులు బెదిరించి దాడి చేశారు. మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు. గురువారం డిసిపి పద్మజ, ఏసీపీ రామ లింగరాజు, సీఐ ప్రవీణ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో వివారాలు వెల్లడించారు.. ఫేక్ పోలీసులమని చెప్పిన ఆరుగురు దుండగులను పోలీసులు కేసున ఛేదించి పట్టుకున్నారు. లాడ్జీలో పేకాట ఆడుతున్న ముగ్గురిపై తుపాకీతో బెదిరించి వారి వద్ద నుండి దాదాపు 2,20,000 రూపాయలను అపహరించిన డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆరుగురి సూడోపోలీసుల వివరాలు అకీల్, అహ్మద్, షేక్ మహమ్మద్, అక్సర్, కైజర్, మహమ్మద్ ల ను మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి, క్రైమ్ టీమ్ సహాయంతో వారిని పట్టుకున్నారని డిసిపి పద్మజ పత్రిక సమావేశంలో పేర్కొన్నారు.. డీసీపీ పద్మజ మాట్లాడుతూ లాడ్జీలను అద్దెకు ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని లాడ్జీ యాజమాన్యాలకు సూచించారు. ఇంత త్వరగా కేసును ఛేధించినందుకు పోలీసులను డిసిపి పద్మజ అభినందించారు. పేకాట వ్యసనమే..క్రిమినల్ ఆలోచనకు దారితీసింది.. పిర్యాదు దారులు మణికంఠ,శ్రీహరి, సామ్ సంగ్ లు తరచు నిజామాబాదుకు చెందిన అఖిల్ అహ్మద్, అహ్మద్ అజిమ్, షేక్ అహ్మద్ లతో అందర్,బాహర్ అనే పేకాట ఆడేవారు.. ప్రతిసారీ మణికంఠ అతని స్నేహితులే డబ్బులు గెలుచుకుంటున్నారనే అక్కసుతో , వారి దగ్గర నుండి ఎలాగైనా డబ్బులు కాజేయాలని నిందితుడు ఏ1 అఖిల్ అహ్మద్ పథకం ప్రకారం పేకాట ఆడుదామని వారిని మేడ్చల్ పట్టణంలోని ఆర్ఆర్ లాడ్జ్ కు పిలిపించాడు,అఖిల్ అహ్మద్ ముందుగా వేసిన ప్లాన్ ప్రకారం షేక్ అక్బర్, గణేశ్, ఖైసర్ లతో కలిసి ముఠాగా ఏర్పడి వీరు ఆడేరూమ్ సమీపంలోనే మరో రూమును తీసుకున్నాడు. పేకాడ ఆడే సమయంలో సదరు రూము తలుపులు కొట్టగా..లోపల వ్యక్తులు తలుపులు తీయగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఖైసర్ ,గణేష్ లు డమ్మి తుపాకీ తో బెదిరించి ,లాఠీలతో కొడుతుండగా వారి దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి వదలమని ప్రాదేయ పడ్డారు. ఆ డబ్బులు ఖైసర్ తలదిండు కవర్ లో వేసుకొని కింద తమ సి.ఐ సార్ ఉన్నాడని కదలకుండా ఇక్కడే ఉండాలని హెచ్చరించి వెళ్ళిపోయారు..,, ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా అక్కడ ఎవరూ లేని విషయం గమనించిన బాదితులు.. వారు సూడోపోలీసులుగా గుర్తించి వెంటనే మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మేడ్చల్ పోలీసులు మూడు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వెతకగా తూప్రాన్ వద్ద పోలీసులు వీరిని అఖిల్ అహ్మద్, షేక్ అహ్మద్, షేక్ ఆజమ్,షేక్ అక్బర్,గణేష్ మరియు షేక్ ఖైసర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని డి.సి.పి తెలిపారు. వారి వద్ద నుండి ఒక డమ్మి గన్,ఫైబర్ లాఠీ, జంగిల్ షూస్, పోలీస్ క్యాప్ మరియు 2,22,000/- రెండు లక్షల ఇరవై రెండు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు..








No comments:
Post a Comment