Followers

గొలగానికే....మేయర్ పీఠం

 గొలగానికే....మేయర్ పీఠం

జి.వి.ఎం.సి. మేయరు గా హరి వెంకట కుమారి ఎన్నిక

విశాఖ పొలిటికల్, పెన్ పవర్  

విశాఖ నగర మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆరిలోవ 11 వ వార్డు వై.ఎస్.ఆర్.సి.పి. అభ్యర్ధినిగా 4850 మెజారిటీ తో గెలిచి అందరి మన్ననలు పొందిన గొలగాని హరి వెంకట కుమారి ని నేడు విశాఖ నగర మేయర్ పదవి వరించింది. ఆమె  ఒమ్మి లక్ష్మీ, మరియు స్వర్గీయ ఒమ్మి అప్పల నాయుడు దంపతుల  ప్రధమ కుమార్తె. ఆమెది ఒక సామాన్య  సాదా సీదా కుటుంబం. బి.ఎస్.సి.,బి.ఇ. డి. విద్యను అభ్యసించారు. అంతకు మించి ప్రజాసేవ అనే గ్రంధాన్నిక్షుణ్ణంగా పఠించిన సేవాతత్పరత భావాన్ని కలిగిన నిగర్వి.  స్వర్గీయ దివంగత నేత, మాజీ మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు ఆకర్షితుడై  ప్రజాసేవకే అంకితమైన గొలగాని శ్రీనివాస్ ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి అనునిత్యం భర్త అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరి తో మమేకమై తారతమ్య బేధాలు లేకుండా ప్రజాసేయస్సుకు పాటుపడుతూ నేడు మేయర్ పీఠాన్ని అధిష్టించారు. ఈ సందర్బంగా మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ.   ఒక బి.సి. సామాజిక మహిళకు మేయర్ పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుల మత వర్గ తరతమ్యా బేధాలు లేకుండా అందరికీ  అన్నివేళలా అందుబాటులో వుంటూ అవినీతికి తావు లేకుండా  ప్రజల సమస్యలను తీర్చడమే నా ప్రధాన ద్యేయమని మరియు నగరం లోని అన్ని వ్వార్డులను సందర్శించి  సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుడు గోలగాని  శ్రీనివాస్ మాట్లాడుతూ.....కార్పొరేషన్ ఏజండా గా మంచి నీటి సమస్య లేకుండా చూస్తామని, డ్రైనేజీ వ్యవస్థ ను ప్రక్షాళన పరుస్తామని,   పారిశ్రామిక వేత్తలు  పెట్టుబడులు పెట్టె రీతిలో నగరాన్ని తీర్చిదిద్దుతామని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి  పరుస్తామని,  100 సంవత్సరాల చరిత్ర కలిగిన ముడసర్లోవ రిజర్వాయర్ ను అభివృద్ధి చేస్తామని,  సిటీ లో ఉన్న విలీన మారుమూల ప్రాంతాలన్నింటినీ జోనల్ కమీషనర్, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధి, వ్వాలంట్రీ, సచివాలయా వ్యవస్థ లను కలుపుకోని ఒక ప్రణాళిక బద్దం గా అభివృద్ధి చేస్తామని, ఆరోగ్య విషయం లో స్థానికంగా ఉన్న ప్రాథమిక వైద్యశాలాలను అభివృద్ది పరిచి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని, నగరం లో లక్షలాది వాహనాల వలన ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని పోలీస్ కమీషనర్ వారిని సంప్రదించి ప్రజలకు అనుకూలంగా ఆ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా ప్రకటించడం జరిగిందని ఆయన ఆశీస్సులతో, విజయసాయిరెడ్డి సూచనలతో ఈ నగరాన్ని యావత్ దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్ధి ప్రపంచ పటంలో చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారులు, రాజకీయ నాయకులు అనే తారతమ్యం లేకుండా, పార్టీ వైషమ్యాలు పొడ చూపకుండా అందరూ ఒకే కుటుంబం లా పనిచేసి ప్రజా సంక్షేమానికి, కార్పొరేషన్ అభివృద్ధి కి పాటు పడాలని హితవు పలికారు. విశాఖ జోనల్ కమిషనర్ లు, కార్పొరేషన్ యూనియన్ లీడర్లు, వివిధ సంఘాల పెద్దలు, ఎన్నికయిన పాలక మండలి కార్పొరేటర్లు, వివిధ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ లు, విద్యార్థులు, చర్చ్, మసీదు మత పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా సంఘాలు , విద్యుత్ సంఘ ఉద్యోగులు మేయర్ నుమర్యాద పూర్వకంగా కలసి  అభినందించారు. పూలమాలలు, పుష్ప గుచ్చాలు సమర్పించి  శాలువాలు కప్పి సన్మానించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...