Followers

కరోనాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి

 కరోనాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి

కరోనా నివారణకు సామాజిక దూరం, మాస్క్ ధరించడం, పరిశుభ్రత ప్రతి ఒక్కరు విధిగా పాటించాలి

నిబంధనలు పాటించండి.   కరోనా నిర్మూలనకు సహకరించండి

ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్

పార్వతీపురం,పెన్ పవర్

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు.ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ కోవిడ్  సెకెండ్ వేవ్ ఉదృతమవుతున్న వేల  ప్రభుత్వ ఆదేశాలతో  ఆన్ని ప్రాంతాలలో ప్రజలను చైతన్య పరచే భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టవలసిన పనులకు సంబంధించి ముందుగా అందరిలో అవగాహన కల్పించాలన్నారు.  ప్రతి ఒక్కరు వెక్షినేషన్ పై అపోహలు విడిచి, 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వెక్షినేషన్ చేయించుకునే విధంగా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వెక్షినేషన్ వేయించుకొని, అందరూ మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటు  కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలన్నారు. పాఠశాలలో, కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు కరోనా నిర్మూలనకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు తద్వారా వారు వారి తల్లిదండ్రులలో అవగాహన కల్పించడం జరుగుతుందని,  సమాజ హితం కొరకు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని హితవుపలికారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...