అధికారులు కాకమ్మ కథలు మానుకోవాలి
గూడెం కోత్తవీధి,పెన్ పవర్రెవెన్యూ అధికారులు,గిరిజనేతరలు కుమ్మక్కై అక్రమ కట్టడాలకు సపోర్ట్ చేస్తున్న రెవెన్యూ అధికారులు పై చర్యలు తీసుకోవాలని, అధికారులు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటున్న అధికారులు మానేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబు అన్నారు,గత రెండేళ్లుగా ఆదివాసీ జెఏసి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం నడుపుతూ ఆదివాసీ చట్టాలు, హక్కులు సక్రమంగా అమలు కావడం లేదని, వాటిని సక్రమంగా అమలు చేయాలని ఆదివాసీ జెఏసి నాయకులు పాడేరు డివిజన్ అధికారికి, మండల రెవెన్యూ అధికారులను కలిసి వినతిపత్రాలు, ఇచ్చినప్పటికీ స్పంందించక గిరిజనేతరలకు సపోర్ట్ చేస్తుందా అని, ఎన్నోసార్లు వినతిపత్రాలు, విజ్ఞప్తిలు చేస్తూ ఆదివాసీ గిరిజనుల ఆవేదనలు, వేదనలు, వాదనలు వినిపిస్తున్నా జిల్లా అధికారులు గానీ, పాడేరు డివిజన్ అధికారులు గానీ, మండల రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు,ఈ మధ్య ముడు రోజుల క్రితం ఒక్కసారిగా పాడేరు ఐటీడీఏ పీవో గిరిజనుల హక్కులు, చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని అనడం ఆశ్చర్యానికి గురి చేసిన, ఆయన మీద ఆదివాసీలకు కొంత నమ్మకం ఉందని, గతంలో ఆయన సబ్ కలెక్టర్ గా చింతపల్లిలో మాట్లాడిన మాటలకు చాలా మంది ఆదివాసీలు తమ హక్కులను చట్టాలను కాపాడుకోవాలని ముందుకు వచ్చారని, కానీ అధికారులు నుండి మాత్రం కొంచెమైనా సహాకారం లేదని ఆదివాసీల భూములు ఆక్రమణకు గురైతే పట్టించుకోవడమే కాదు,తమ శాఖకు కేటాయించిన భూముల ఆక్రమణ జరుగుతున్న పట్టించుకోని అధికారులు ఐదవ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నారని ఇదే అధికారులు నాన్ షెడ్యూల్ ప్రాంతానికి వెళితే అక్కడ సక్రమంగా పని చేస్తున్నారని మైదాన ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలే కాదు, చిన్న చిన్న ప్రహారీ గోడలు కూడా కూల్చే అధికారులు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలోని మాత్రం చట్టాన్ని అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందుకు ఉన్నారో తెలియడం లేదన్నారు, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతరలకు రాజకీయ నాయకులు అండదండలతో ఒత్తిళ్లు కూడా పెద్దగా ఉండనప్పటికీ జిల్లా అధికారులు, పాడేరు డివిజన్ అధికారులు, మండల అధికారులు సక్రమంగా చట్టాలను అమలు చేయలేకపోతున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో, పాడేరు సబ్ కలెక్టర్ అధికారులు ఆదివాసీ చట్టాలను, హక్కులను సక్రమంగా అమలు చేయాడానికి ప్రయత్నం చేస్తారని ఆదివాసీ తరపున ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు, అక్రమ భావనల పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజుబాబు డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment