సావిత్రి భాయి ఫూలే స్నేహితురాలు ఫాతిమా షేక్ పుస్తక ఆవిష్కరణ
పెన్ పవర్, రావులపాలెంఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే స్నేహితురాలు ఫాతిమా షేక్ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం రావులపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. సామాజిక కార్యకర్త హాఫిజ్ షేక్ అజహర్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి 127వ వర్ధంతి సందర్భంగా గొలుగూరి మునిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇరువురి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపసర్పంచ్ మునిరెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకం మహాత్మ జోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే లతో కలసి 170 సంవత్సర క్రితం భేటి పడావ్ ఉద్యమానికి నాంది పలికిన ఫాతిమా షేక్ మీద భారతదేశంలో వెలువడిన మొట్టమొదటి గ్రంథమని అన్నారు.మహాత్మ జోతిరావు ఫూలే సావిత్రి బాయి ఫూలే లను ఫూలే తండ్రి గోవిందరావు ఫూలే తన ఇంటి నుంచి వెళ్లగొట్టినప్పుడు ఫూలే దంపతులకు తమ ఇంట ఫాతిమా షేక్, ఆమె అన్న ఉస్మాన్ షేక్ ఆశ్రయం కల్పించారని తెలిపారు. మరో ముఖ్య అతిథి మాజీ మండల ప్రతిపక్ష నేత కుడిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫాతిమా షేక్ మరాఠి భాష నేర్చుకుని సావిత్రి బాయితో కలసి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది పూలే ప్రారంభించిన పాఠశాలల్లో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా ఉచిత సేవలు అందించారని ఆయన తెలియజేశారు.ఈకార్యక్రమంలో వరగోగుల వెంకటేశ్వరరావు,యార్లగడ్డ జగజ్జీవన్ రావు,ఎం.పి.జే జిల్లా అధ్యక్షులు షేక్ వలియా, రబ్బానీ ఖాన్, అహ్మద్ బాషా, ముహమ్మద్ యాశీన్, షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment