ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్,పెన్ పవర్
బోథ్ నియోజకవర్గ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావ్ జన్మదిన వేడుకలను కార్యకర్తలు, నాయకుల మధ్య శుక్రవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపారు టి ఆర్ ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఏడేండ్ల కాలంలో బోథ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు.అనంతరం మండల ప్రెస్ క్లబ్ తరపున పాత్రికేయులు జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాత్రికేయులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు దశరథ్ రెడ్డి, బండారి రవీందర్, మురళీ, సాక్షి శ్రీనివాస్, కొండా ప్రశాంత్, సిద్దార్థ్, టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా కోశాధికారి బూర్ల లక్ష్మీనారాయణ, కోఆప్షన్ సభ్యుడు జమీర్, నాయకులు జాదవ్ రమేష్,రావణ్ ముండే, మాధవ్ కేంద్రే, కుమ్మరి సత్యరాజ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment