డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ మాదిగల హక్కు
ఎమ్మార్పీఎస్ టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్
జగిత్యాల,పెన్ పవర్
బడ్జెట్ సమావేశాల్లో డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ కు బిల్లు ప్రవేశపెట్టాలని స్థానిక జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ ఎస్సారెస్పీ గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి డప్పు కొట్టే వృత్తిదారులకు చెప్పులు కుట్టే వృత్తి దారులకు ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి కి చాలాసార్లు తీసుకొచ్చామని అయిన ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు అణగారిన కులాల్లో చాలా కులాలకు వృత్తుల పేరుమీద పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వాటిని మేము స్వాగతిస్తున్నామని వారిలాగే మాకు కూడా రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం మాదిగలను ఉప కులాల వారిని ఆదుకోవాలని రానున్న బడ్జెట్ సమావేశాల్లో డప్పు చెప్పు బిల్లు ప్రవేశపెట్టాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డప్పు చెప్పు పెన్షన్ సాధించి తీరుతామని అన్నారు సమావేశంలో ఎమ్మార్పీఎస్ టి ఎస్ జిల్లా ఇంఛార్జి లింగంపల్లి లక్ష్మణ్, జగిత్యాల మండల అధ్యక్షులు మెదపట్ల చంద్రయ్య, సామాజిక సేవ సభ్యులు ఎండీ షోయబ్ అఫీజ్, ఎండీ అలి, ఎమ్మార్పీఎస్ నాయకులు రమణ చికుముల గంగరాజు, తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment