ఆక్వా రైతులకు విజ్ఞప్తి
పెన్ పవర్,కొవ్వూరు
ఎపీ ఎస్ ఎ డీ ఎ 2020 అమలు అవుతున్న వలన ఆక్వా రైతులు, చేపలు,రొయ్యల మేత & మందుల షాపు యజమానులు, వారు మొదలైన ఆక్వా రంగంపై ఆధారపడి వ్యాపారం చేస్తున్నవారు అందరూ కూడా పాత లైసెన్స్ ఉన్న వారు సచివాలయం లో ఎండార్స్మెంట్ చేయించుకోవలెను.ఎండార్స్మెంట్ పూర్తిగా ఉచితం. పాత లైసెన్స్ లేనివారు కొత్త లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవలెను.కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఎకరానికి 1000 రు. చెల్లిచవలెను. కావున మీయొక్క గ్రామ మత్స్య సహాయకులను కలిసి వెంటనే దరఖాస్తులు చేసుకోవలెను.ఈ విధంగా లైసెన్స్ ఎండార్స్మెంట్ మరియు కొత్త లైసెన్స్ దరఖాస్తు చేసుకొనుటకు మే 31 వ తారీకు వరకు 3 నెలలు గడువు ఇచ్చి ఉన్నారు. కావున ఈ తారీకు దాటిన తర్వాత లైసెన్సులు లేకుండా ఉన్నవారిని పై అధికారులు చర్యలు తీసుకోగలరు. అందరూ వెంటనే లైసెన్సులు కొరకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకొనగలవారని తెలియపరచడమైనది..
ఎండార్స్మెంట్ కు జత పరచ వలసిన పత్రములు..
1.ఆధార్ కార్డ్ జిరాక్స్
2.పాస్ బుక్ జిరాక్స్
3.పాత పర్మిషన్ ఒరిజినల్
4.వారి చెరువు యొక్క గూగుల్ మ్యాప్
5.ఫోన్ నెంబర్ ( ఆధార్ నెంబర్ తో లింక్ అవ్వాలి)

No comments:
Post a Comment