నేరస్తులను గుర్తిస్తున్న సిసి కెమెరాలు, డీఎస్పీ
వనపర్తి, పెన్ పవర్వనపర్తి: నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో సి.సి కెమెరాలు కీలకంగా నిలుస్తున్నాయని వనపర్తి డీఎస్పీ తెలిపారు. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తి డీఎస్పీ కెఎం, కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వనపర్తి సీఐ, సూర్యనాయక్, వనపర్తి పట్టణ ఎస్సై,వెంకటేష్ గౌడు, వనపర్తి పట్టణంలోని మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమిష్టి భాగస్వామ్యంతో వనపర్తి పట్టణ పోలీసులు నూతనంగా నేను సైతం కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలో వివిధ కాలనీలలో 100 వైర్ లెస్ సీసీ కెమెరాల ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఆర్థిక సహాయానికి దాతలు ముందుకు వచ్చే విదంగా పట్టణ పౌరుల్లో చైతన్యం తీసుకు రావాలని మున్సిపాలిటీ పాలక వర్గాన్ని ఆయన కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేరాల నియంత్రణకు సి.సి కెమెరాల ప్రాధాన్యతపై ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని చెప్పారు. ప్రస్తుతం నేరాలను పరిష్కరించడంలో సి.సి కెమెరాలో నమోదయిన దృష్యాల ఆధారంగా నేరస్తులను గుర్తించడంతో పాటు, నేరం జరిగిన తీరును తెలుసుకోవడం సులభమవుతోందని తెలిపారు. అదే విధంగా నేర దర్యాప్తులోను సి.సి కెమెరాలలోని దృష్యాలు ప్రధాన సాక్ష్యంగా నిలవడంతో పాటు నేరానికి పాల్పడిన నేరస్తుడికి శిక్షపడటంతో ఈ సాక్ష్యం కీలకంగా పరిగణించ బడుతోందన్నారు. త్వరలో వనపర్తి పట్టణంలో కౌన్సిలర్లు, వ్యాపారస్థుల భాగస్వామ్యంతో ఏర్పాటు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు మహిళలకు భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. వనపర్తి జిల్లా పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారన్నారు.సైబర్ నేరాల కట్టడి ముఖ్యంగా నేరాల నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో వనపర్తి జిల్లా పోలీసులు చురుకుగాపనిచేస్తున్నారని తెలిపారు. పోలీసులు తమ విధుల్లో మరింత రాణించాలంటే ప్రజల సహకారం అవసరం ఇందుకోసం కౌన్సిలర్లు, దాతల సహకారంతో 100 ఏర్పాటు చేయడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. పట్టణ పౌరుల భద్రతకు పోలీసులు తీసుకొంటున్న అన్ని రకాల చర్యలకు తమ మున్సిపాలిటీ పాలక వర్గం సహాయ సకారాలు సంపూర్ణoగ అందిస్తుందని మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ తెలిపారు. సిసి కెమెరాల వలయంలో వనపర్తి పట్టణాన్ని ఏర్పాటు చేయడo ఆనందించ దగిన శుభ పరిణామమని ఆయన అర్షం వ్యక్తం చేశారు. పట్టణ పౌరులకు సంబంధించి పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేయడం చాలా సంతోసమని అభిప్రాయపడ్డారు. నేర నియంత్రణకు వనపర్తి పోలీసులు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ పట్టణ పౌరుల మన్ననలు పొందుతున్నారని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమములో వనపర్తి సిఐ, సూర్య నాయక్ వనపర్తి పట్టణ ఎస్సై, వెంకటేష్ గౌడ్, వనపర్తి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వార్డు కౌన్సిలర్లు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment