పార్టీలో గ్రామ స్థాయి నుండి యువనాయకత్వాన్ని బలోపేతం చేస్తాం...
విశాఖపట్నం, పెన్ పవర్పార్టీలో గ్రామ స్థాయి నుండి యువనాయకత్వాన్ని బలోపేతం చేస్తాం.వెన్నుపోటు రాజకీయాలను సహించం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్.రానున్న రోజుల్లో పార్టీలో యువనాయకత్వాన్ని పెద్దఎత్తున బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ,శాసన మండలి సభ్యులు బుద్ద నాగ జగదీష్ అన్నారు.పార్టీలో ఉంటూ వెన్నుపోటు రాజకీయలను చేస్తున్న నాయకులను సహించేదిలేదని తెలిపారు.కొన్ని గ్రామాలలో తక్కువ ఓట్ల వత్యాసంతో ఓడిపోయినందుకు భాద కలిగించందని అన్నారు. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని టీడీపీ గెలుచుకోవడం ఖాయం అని అన్నారు.ఈ రోజు గవరపాలెంలో స్థానిక మళ్ళ జగన్నాధం కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ విస్తృత సమావేశంలో వారు పాల్గొన్నారు.
అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన నాయకులని వదిలిపెట్టమని అన్నారు.ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాయల మురళి, కొణతాల సావిత్రి- శ్రీనివాసరావు, పచ్చికూర రాము, బుద్దిరెడ్డి చిన్నా,ఎల్లంకి సత్తిబాబు,నడిపల్లి గణేష్,సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, ఉగ్గిన రమణ మూర్తి,కడిమిశెట్టి నరసింగ రావు, మువ్వల అప్పల నాయుడు, అక్కిరెడ్డి రమణ బాబు, రేబాక ప్రసాద్,కర్రీ బాబీ,సిద్దిరెడ్డి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment