మాలసింగారం లో మంచినీటి కష్టాలు తీర్చండి మహాప్రభో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ డిమాండ్
అరకు, పెన్ పవర్
ఆంధ్ర ఊటీ గా చెప్పుకుంటున్న అరకులోయ పరిధిలో గల చినలబుడు గ్రామపంచాయతీకి చెందిన సుమారు150 గడపలు 700కి పైగా జనాభా గల మాలసింగారం గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని గురువారం, అరకువేలి యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మొస్య ప్రేమ్ కుమార్ పాలకులపై మండిపడ్డారు, ఆయన ఆధ్వర్యంలో కాలిబిందెలు పట్టుకొని గ్రామస్తులు రోడ్ షో ద్వారా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి సమస్య అధికంగా ఉందన్నారు, వర్షాకాలంలో మంచినీళ్లు దొరక్క గ్రామస్తులు చాలా అవస్థలు పడుతున్నారని కలుషిత మురుగు నీళ్లు తాగడం వల్ల చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు చాలా రకాలైన జబ్బులు విషజ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని. మంచి నీటి సమస్య పై ఎన్నో సార్లు అధికారులకు విన్నవించిన పెడచెవిన పెడుతు న్నారని మండిపడ్డారు.ఇప్పటికైన పాలకులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గ్రామానికి చేరువలో ఉన్న చంప గడ్డ ఊట నీళ్లను శుద్ధిచేసి కోళాయిల ద్వారా గ్రామంలో శుభ్రమైన మంచినీళ్లు అందించి మాలసింగారం లో ఉన్న మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మొస్య దేవదాసు, కిల్లో దుతి, బిసోయి సుశీల, కీల్లో లక్ష్మి, సుంకరి బృందా, గ్రామ పెద్దలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment