రక్షిత్ ఫార్మాలో ముగిసిన బద్రతా వారోత్సవాలు
పరవాడ,పెన్ పవర్
జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ లోని రక్షిత్ ఫార్మాలో ఈనెల 4 వతేదీ నుంచి ప్రారంభం అయిన 50 వ భద్రతా వారోత్సవాలు మంగళవారం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యమానికి రక్షిత్ డ్రగ్స్ ప్రేవేట్ లిమిటెడ్ చైర్మన్ సిహెచ్.ఏ.పీ రాజేశ్వరరావు,జె.శివశంకర రెడ్డి(జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్)పి.చిన్నారావు(ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్)ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.కార్యక్రమంలో శివశంకర రెడ్డి కార్మికులను వుద్యేసించి మాట్లాడుతూ విధులు నిర్వహించేటప్పుడు తీసుకో వలిసి జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు.అనంతరం బద్రతా వారోత్సవాలలో పలు కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమాలను సంస్థ యాజమాన్య ప్రతినిధి ఎమ్.పి దొర,సేఫ్టీ మేనేజర్ ఆర్.వి.ఎస్ కుమార్ ల నేతృత్వంలో నిర్వహించారు.

No comments:
Post a Comment