అంజలి శనివారం హెచ్.ఎం పై చర్యలకు పీవో ఆదేశం
పెన్ పవర్, విశాఖపట్నంనాడు నేడు పనులపై నిర్లక్ష్యం వహిస్తున్న అంజలి శనివారం హెచ్ఎం పై చర్యలు తీసుకోవాలని పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ టి డి ఎ) పి ఓ వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు 11 మండలాల ప్రధానోపాధ్యాయులుతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాడు నేడు పనులు నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈ సమావేశానికి కూడా హాజరుకాని అంజలి శనివారం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డి డి జి విజయ్కుమార్ ని ఆదేశించారు. నాడు నేడు పనులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని వి పివో హెచ్చరించారు. మార్చి నెలాఖరు నాటికి నాడు నేడు పనులు పూర్తిచేయాలని నిధులు దుర్వినియోగం అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పివో హెచ్చరించారు. నాడు నేడు మనబడి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పిఓ కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఏజెన్సీలోని మండల విద్యాశాఖ అధికారులు హెచ్ ఎం లు పాల్గొన్నారు.

No comments:
Post a Comment