Followers

ఏబీవీపీ విద్యార్థుల అర్ధనగ్న ప్రదర్శన

 ఏబీవీపీ విద్యార్థుల అర్ధనగ్న ప్రదర్శన


కూకట్ పల్లి, పెన్ పవర్

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులను, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రధానద్వారం ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన కార్యక్రమని నిర్వహించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి కె.పి.హెచ్.బి కాలనీ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేద దళిత, బహుజన, గిరిజన వర్గాల విద్యార్దులకు విద్యను దూరం చేయాలన్న కుట్రలో భాగంగా ప్రయివేటు యూనివర్సిటీలకు పట్టం కట్టేలా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పద్దెనిమిది నెలలుగా ఖాళీగా ఉన్న ఉపకులపతుల పోస్టులను, బోధన బోధనేతర సిబ్బందిని నియమించడం లేదని, తెరాస  ప్రభుత్వానికి మద్యం అమ్మడంలో ఉన్న శ్రద్ధ విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై లేదని విమర్శించారు. చదువుకునోళ్ళకు కొలువులు లేవని, సర్కారు బడుల్లో పంతుళ్లు లేరని, తన బిడ్డకి ఆరునెలలు పదవి లేకపోతే ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ పదవి ఇప్పించిన కేసీఆర్ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.  వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని లేని యెడల ప్రభుత్వం గద్దె దిగేవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నిఖిల్, రాకేష్, ప్రసాద్, వేణు, సుధీర్, గోపాల్, సాయి, ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...