నాణ్యత ప్రమాణాలు పాటించి మంచి ధర పొందవచ్చు,,,
మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు
కేసముద్రం, పెన్ పవర్మిర్చి పండించిన రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి మార్కెట్ కు అమ్మేందుకు తీసుకువస్తే మంచి ధర దక్కుతుందని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావు అన్నారు. బుధవారం మిర్చి యార్డులో వేలం పాటలను పరిశీలించారు. మార్కెట్ కు వచ్చిన మిర్చిని చూసి రైతులతో మాట్లాడారు. రైతులు తాము తీసుకువచ్చే మిర్చిని పూర్తిగా ఎండబెట్టి , తాలు లేకుండా వేరు చేసి తీసుకురావాలన్నారు. పూర్తిగా ఎండబెట్టకుండా తేమగా ఉన్న మిర్చిని అమ్మకానికి తెస్తే ఆశించిన ధర దక్కదని అన్నారు. వ్యాపారులు వేలం పాటలు అయిపోయిన వెంటనే తూకాలు వేసి రైతులను త్వరగా వారి వారి గ్రామాలకు పంపించే విధంగా చూడాలని వ్యాపారులకు సూచించారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు ఉన్న ప్రతిష్టను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మార్కెట్ కు వచ్చిన ప్రతి రైతు భాదతో కాకుండా, సంతోషంగా వెళ్ళేవిధంగా మార్కెట్ అధికారులు, వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది వ్యవహరించాలని కోరారు.
No comments:
Post a Comment