అదుపుతప్పికాల్వ లోకి దూసుకెళ్లిన కారు
పెన్ పవర్,ఆత్రేయపురం
లొల్ల లాకుల వద్ద గురువారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి ప్రధాన పంట కాలువలోకి దూసుకెళ్లింది ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు.
మహాశివరాత్రి సందర్భంగా వీరు భీమవరం నుంచి కారులో ఆత్రేయపురం మండలం వసంతవాడ ఉమా పార్వతీశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా గొల్లలకోడేరుకు చెందిన చింతలపాటి శ్రీనివాసరాజు(46), ముందుటి సురేష్ వర్మ(36), ఇందుకూరి వెంకట సత్యనారాయణ రాజుగా పోలీసులు గుర్తించారు. మొత్తం కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ముదునూరి వెంకటగణపతిరాజు, ముందిటి సీతారామరాజు సురక్షితంగా బయటపడ్డారు. ఆత్రేయపురం ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


No comments:
Post a Comment