రాష్ట్ర అభివృద్ధికి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు
పెన్ పవర్,గోపాలపురంరాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కొనియాడారు.వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఏ.ఎం.సీ.కార్యాలయ ఆవరణలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్న కార్యక్రమానికి ఎమ్మెల్యే తలారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో లో ఎన్నడూ జరగని విధంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ అభివృద్ధ పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటిని ఏమీ లెక్కచేయకుండా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం వై.ఎ స్.జగన్ అనిఅన్నారు.అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకున్నారని అన్నారు. దశాబ్ద కాలం నుండే ప్రజలకు ఇళ్ల స్థలాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారని జగనన్న రాకతో ఆ సమస్య తీరిపోయింది అని అన్నారు.ప్రస్తుత నెల పట్టాల పంపిణీ జరిగిందని త్వరలో గృహాలు నిర్మించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

No comments:
Post a Comment