నియమావళికి కట్టుబడి ఓట్ల లెక్కింపు చేపట్టాలి...!
సామర్లకోట, పెన్ పవర్మున్సిపల్ ఎన్నికలకు సంబందించి ఈ నెల 14వ తేదీ ఆదివారం నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఎన్నికల కమీషన్ నియమావళికియ కట్టుబడి సిబ్బంది ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని నియోజక వర్గ ఎన్నికల అధికారి, పెద్దాపురం ఆర్టీవో ఎస్ మల్లిబాబు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మున్సిపల్ ప్రత్యేకాధికారి భానూప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించారు. దానిలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ అభ్యర్థులకు నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు వివరాలు తెలిపే విధంగా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కష్టపడి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించినా ఆరోపణలు రావడం సహజంగా జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అంతా సహనంతో వ్యవహరించాలన్నారు. లెక్కింపు కేంద్రాల్లోనికి సెల్ ఫోన్లు అనుమతి లేనందున వాటితో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ బోమన్నారు. లెక్కింపు సమయంలో అభ్యర్థులు వారి అనుచరులు సిబ్బందిని ఏ విధంగానూ ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో సిబంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డీవో, ప్రత్యేకాధికారులు పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో ఇంకా మన్సిపల్ కమీషనరు బీఆర్ శేషాద్రి, మేనేజరు అచ్యుతరాజు, ఓట్ల లెక్కింపు సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Post a Comment