Followers

వైసీపీ కాంగ్రెస్ పార్టీకి పదవుల కన్నా, ప్రజా శ్రేయస్సే ముఖ్యం

వైసీపీ పార్టీకి పదవుల కన్నా, ప్రజా శ్రేయస్సే ముఖ్యం

 విజయనగరం,పెన్ పవర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదవుల కన్నా, ప్రజా శ్రేయస్సే ముఖ్యం అని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం నాడు నగరంలోని 16 వ డివిజన్ పరిధిలో కమ్మ వీధి లో ఏర్పాటుచేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఎమ్మెల్యే కోలగట్ల ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ,కార్యకర్తలు జోహార్ వైయస్ఆర్ ఆర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ  నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయా లే ఊపిరిగా, ఆయన ఆలోచనలే శ్వాసగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు పదకొండవ వసంతంలో అడుగు పెట్టడం సంతోషకరమన్నారు. ప్రజా బలమే పునాదిగా, అధికారం చేపట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పదేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని బలమైన శక్తిగా ఎదిగింది అన్నారు. ప్రజలే దేవుళ్ళు గా, ప్రజా క్షేత్రమే దేవాలయం గా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది అన్నారు. అరాచక పాలనలో మగ్గుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేనున్నానని నమ్మకాన్ని ప్రజలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి  కల్పించారని అన్నారు. విశ్వసనీయత, విలువలకు ప్రాధాన్య ఇచ్చే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పార్టీ నగర  పాలక అధ్యక్షులు ఆశ పు వేణు, డివిజన్ పార్టీ పోటీ అభ్యర్థి గుజ్జల నారాయణరావు లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల ఇన్చార్జిలు ఎస్. వి. వి. రాజేష్, ముచ్చు శ్రీను, వై. కుమారస్వామి, అల్లు చాణక్య, జిల్లా సేవాదళ్ అధ్యక్షు లు  లు మారం బాల బ్రహ్మారెడ్డి లతోపాటు పార్టీ నాయకులు రంగబాబు దొర, సన్నీ బాబు దొర, వెంపటాపు శ్రీనివాసరావు, షకీల్, శ్రీమతి మీసాల రమాదేవి  పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...