బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకుల డిమాండ్
ఆదిలాబాద్,పెన్ పవర్
ఏదైతే గతంలో ఉన్న జరిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి నీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసినటువంటి అనుచితమైన వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ అదిలాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలో గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక మాదిగ బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అనేక మైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యను అదేవిధంగా నాణ్యత ఆహారాన్ని అందిస్తూ రానున్న దశలో కులాల్లోని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని ఉద్దేశంతోనే ముందుకు నడుపుతున్న ఇటువంటి ప్రవీణ్ కుమార్ పై ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని లేని ఎడల బిజెపి నాయకులను ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో నిరసన కార్యక్రమాలను అడ్డుకొని తిరిగి తనే ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ హెచ్చరిస్తోంది అదేవిధంగా ఉన్నత స్థాయిలో దళితులు ఉంటే ఇటువంటి బిజెపి పుట్టుక లక్షణాలను బయట పెట్టాల్సిన పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇప్పుడిప్పుడే దళితులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుతుంటే ఓర్వలేక అగ్రవర్ణాల చేతి చేతులు కీలుబొమ్మగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నాం గ్రామ గ్రామాన ఈ బిజెపి నాయకులు దళితులపై చేస్తున్నటువంటి తీవ్ర ఆరోపణలు ఎండగడుతూ బిజెపి నాయకులను గ్రామాల్లో దళిత వాడలో తిరిగి రాకుండా దళితులు అడ్డుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ బిజెపి నాయకులకు ఎక్కడ కూడా దళితుల పట్ల అనుచితమైన వాక్యాలు చేసినట్లయితే ఎమ్మార్పీఎస్ తీవ్ర పోరాట రూపాలు చేస్తుందని దానికి బాధ్యత బిజెపి వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాదిగ జిల్లా అధ్యక్షులు గజ్జల కాంతం మాదిగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి అశోక్ మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగొండ గంగాధర్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు మాదిగ అదిలాబాద్ జిల్లా ఇంచార్జి మల్యాల కరుణాకర్ మాదిగ ఆశన్న ,ఉషన్న, జాదవ్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment