మధ్యాహ్న భోజన పథకం అమలులో రాజీ పడే ప్రసక్తే లేదు
పెన్ పవర్,విశాఖపట్నం
మధ్యాహ్న భోజన పథకం అమలులో రాజీ ప్రసక్తే లేదని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి అన్నారు. శనివారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఏజెన్సీలోని మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలతో మెనూచార్ట్ ను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అమలులో ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకున్న సహించేది లేదన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సమకూర్చాలని ఇంప్రూమెంట్ ఏజెన్సీలు ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించిన ఎం ఈ వో లు స్పందించకపోయినా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మండలంలో ఎం ఈ ఓ లు భోజన పథకాన్ని తనిఖీలు చేయాలని డి ఈ ఓ ఆదేశించారు. ఎప్పటికప్పుడు మిడ్ డే మీల్స్ సమాచారాన్ని తనకు చేరవేయాలని ఎటువంటి ఆ లక్ష్యం జరిగిన సహించేది లేదని డీఈవో లింగేశ్వర రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో పాడేరు ఐటీడీ ఏ పీవో వెంకటేశ్వర్ సలిజామల ఏజెన్సీలోని ఎం ఈ ఓ హెచ్ ఎం లు పాల్గొన్నారు.

No comments:
Post a Comment