Followers

కూకట్‌పల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

 కూకట్‌పల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

కూకట్ పల్లి,పెన్ పవర్

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎన్నికలు కూకట్ పల్లి మండలపరిధిలో ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్విరామంగా సాగింది. కూకట్ పల్లి మండల పరిధిలో 60 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించిన పోలింగ్ సిబ్బంది ఆలస్యంగా వచ్చిన వారిని మాత్రం ఓటు వేయడానికి అనుమతించలేదు. దీనితో ఓటర్లు కొద్దిసేపు అధికారులను ఓటు వేయడానికి అనుమతించాల్సిందిగా ప్రాధేయపడ్డారు. అలా చేయడానికి రూల్స్ ఒప్పుకోవంటూ అధికారులు సర్ది చెప్పడంతో చేసేదేమీలేక ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు. 

కొన్ని పోలింగ్ బూత్ ల వద్ద సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు ఎండలో నిలబడి ప్రయాసపడుతున్న సరే చోద్యం చూస్తూ సెదతీరారే తప్ప ఓటర్ల కష్టాలను మాత్రం గుర్తించలేదు. దీనితో వయోవృద్దులు, చిన్న పిల్లలతో వచ్చిన ఓటర్లు చెట్ల నీడలో సెదతిరుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ సంబంధించిన ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...