Followers

మే 1 న టూరిజం బ్లాక్ డే గా పరిగణించాలి

 మే 1 న టూరిజం బ్లాక్ డే గా పరిగణించాలి 

 తెలంగాణ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సేల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్

హైదరాబాద్, పెన్ పవర్

మే 1వ తేదీని టూరిజం బ్లాక్ డే గా పరిగనిస్తునట్టు ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్ వారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా  తెలంగాణ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సేల్స్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెస్.రవి కుమార్ మాట్లాడుతూ.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం అండ్ హాస్పిటలిటీ సెక్టార్ని చిన్నచూపు చుస్తున్నారని, బడ్జెట్ లో కూడా ఎలాంటి నిధులు మంజురు కలేదని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వలన అతిగా నష్ట పోయింది ఇండస్ట్రీ టూరిజం & హాస్పిటాలిటీ అన్నారు. లాక్డౌన్లో ప్రభుత్వం అమోదించిన 50%జీతబత్యాలు కూడా అందలేదన్నారు. ఈ విషయాన్ని టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి కుడా తీసుకెళ్లటం జరిగింది అన్నారు.తోటి సహ ఉద్యోగులు కొందరు కోవిడ్ మహమ్మారికి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ.రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన ఏ సహాయం అందలేదని వాపోయారు. దానికి నిరసనగా ఒకరోజు మౌన నిరసన వ్యక్తం చేస్తూ, టూరిజం బ్లాక్ డే గా పరిగానిస్తూన్నామన్నారు. దీనికి తెలంగాణ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సేల్స్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారితో పాటు తెలంగాణ ట్రావెల్ ఏజెంట్స్ & టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ మద్దతు తెలపటం జరిగిందని అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...