Followers

Showing posts with label BUSINESS NEWS. Show all posts
Showing posts with label BUSINESS NEWS. Show all posts

ఆక్వా చెరువులకు అందరు లైసెన్సులు కలిగి ఉండాలి

ఆక్వా చెరువులకు అందరు లైసెన్సులు కలిగి ఉండాలి 




పెన్ పవర్,కొవ్వూరు

దేవరపల్లి మండలం తాసిల్దారు వారి కార్యాలయంలో  మత్స్య శాఖ సహాయ సంచాలకులు బి.సైదా నాయక్ ఆధ్వర్యంలోజిల్లా స్థాయి కమిటీ వారి ఆదేశాల ప్రకారం మండల స్థాయి అధికారులకు ఆక్వా చట్టం 20 20 ఆంధ్రప్రదేశ్ చట్టం మరియు ఆంధ్రప్రదేశ్ చేపల మేతల చట్టం లపై మండల స్థాయి కమిటీ సభ్యులకు కొవ్వూరు మత్స్య శాఖ సహాయ సంచాలకులు సైదా నాయక్ అవగాహన కల్పించారు. కొత్తగా వచ్చిన ఆక్వా చట్టం ప్రకారం శాశ్వత ఆక్వా రైతులు లైసెన్సులు పొందాలి అని సూచించారు. కొత్త చట్టం ప్రకారం పాత లైసెన్స్ కలిగిన వారు మే 30 వ తారీఖు లోగా రెన్యువల్ చేయించుకోవలెను. లైసెన్స్ పొందని చెరువులు మరియు కొత్తగా చేరువులు త్రవ్వుకొనుటకు  సంబంధిత పత్రాలు అనగా ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్కు ,80% వాటర్ లైట్ ఏరియా సెర్టిఫికెట్, గూగుల్ క్యాడ్ మ్యాప్, ఎకరానికి 1000రూపాయల చొప్పున ఫీజుతో గ్రామ సచివాలయం, మత్స్య శాఖ సహాయకులు (వి.ఎఫ్.ఏ) లను సంప్రదించవలెను. జూన్ 30 లోగా ఆక్వా లైసెన్స్ పొందిన వారి చెరువులను ధ్వంసం చేయబడును అని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, ఎంపీడీవో, అటవీశాఖ అధికారి, మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారి వి. దేవానందం మత్స్యశాఖ సహాయకులు ఏ.శాంతి, టి. చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

మే 1 న టూరిజం బ్లాక్ డే గా పరిగణించాలి

 మే 1 న టూరిజం బ్లాక్ డే గా పరిగణించాలి 

 తెలంగాణ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సేల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్

హైదరాబాద్, పెన్ పవర్

మే 1వ తేదీని టూరిజం బ్లాక్ డే గా పరిగనిస్తునట్టు ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్ వారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా  తెలంగాణ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సేల్స్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెస్.రవి కుమార్ మాట్లాడుతూ.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం అండ్ హాస్పిటలిటీ సెక్టార్ని చిన్నచూపు చుస్తున్నారని, బడ్జెట్ లో కూడా ఎలాంటి నిధులు మంజురు కలేదని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వలన అతిగా నష్ట పోయింది ఇండస్ట్రీ టూరిజం & హాస్పిటాలిటీ అన్నారు. లాక్డౌన్లో ప్రభుత్వం అమోదించిన 50%జీతబత్యాలు కూడా అందలేదన్నారు. ఈ విషయాన్ని టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి కుడా తీసుకెళ్లటం జరిగింది అన్నారు.తోటి సహ ఉద్యోగులు కొందరు కోవిడ్ మహమ్మారికి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ.రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన ఏ సహాయం అందలేదని వాపోయారు. దానికి నిరసనగా ఒకరోజు మౌన నిరసన వ్యక్తం చేస్తూ, టూరిజం బ్లాక్ డే గా పరిగానిస్తూన్నామన్నారు. దీనికి తెలంగాణ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సేల్స్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారితో పాటు తెలంగాణ ట్రావెల్ ఏజెంట్స్ & టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ మద్దతు తెలపటం జరిగిందని అన్నారు.

మందమర్రి ఏరియాలోని జిఎం కార్యాలయంలో ఉత్పత్తి ఉత్పాదకత పై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

 మందమర్రి ఏరియాలోని జిఎం కార్యాలయంలో ఉత్పత్తి ఉత్పాదకత పై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

పెన్ పవర్,  మందమర్రి 

మందమర్రి ఏరియాలోని జిఎం కార్యాలయంలోనీ, సమావేశ మందిరంలో డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ బలరాం ఈరోజు కరోన కోవిడ్ ముందస్తు జాగ్రత్త గురించి వాటి ఏర్పాట్ల గురించి మరియు బెల్లంపల్లి రీజియన్ గనుల్లో ఉత్పత్తి ఉత్పాదకత పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు డైరెక్టర్ మాట్లాడుతూ  సంస్థ చైర్మన్ యం డి శ్రీధర్, పాఠశాల మేరకు సింగరేణి, వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు కోసం ముందస్తుగా అవసరమైన మందులు ఆక్సిజన్ సిలిండర్లు వస్తున్నామని ఏరియాలలో ప్రస్తుత బెడ్ లకు అదనంగా మరో 500 బెడ్ లతో ప్రత్యేక అవార్డులు ఏర్పాటు చేసుకొని సింగరేణి సంస్థ డైరెక్టర్లు ఏరియా జనరల్ మేనేజర్ ఆదేశాలు జారీ చేశారు మే నెలలో కేసులో ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటినుండి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అన్ని ఏరియా ఆసుపత్రులను సిద్ధ పరచాలని, వారు కోరారు ఆక్సిజన్ కొరతతో ఏర్పడకుండా ఉండేందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రమల తో సంప్రదింపులు జరుపుతున్నామని సింగరేణి కి ప్రత్యేకించి ఆక్సిజన్ సిలిండర్ సమకూర్చు ఉంటామని తెలిపారు ఈ లోపు స్థానికంగా ఆక్సిజన్ కొనుగోలు చేయాలని కోరారు రాపిడ్ పరీక్షలు నిర్వహించడం కోసం 25, వేల ఇట్లు ప్రభుత్వం నుండి సేకరించామని వీటిని ఏరియాలకు పంపిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో ఉన్న బెడ్ లకు అదనంగా మరికొన్ని బెడ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు స్థానిక భవనాలలో కోవిడ్ వదులుగా ఏర్పాటు చేసుకోవాలని అని సూచించారు చైర్మన్ అనుమతితో 20 మంది వైద్య నిపుణులు నియమించడం జరిగింది ఇంకా అవసరమైన వార్డు బాయ్ నర్సులు సిబ్బందిని స్థానికంగా నియమించుకోవాలని జిమ్ లకు ఆదేశించారు, ర్యాపిడ్ టెస్టులు ఎక్కువగా చేయడంవల్ల వ్యాధి గుర్తింపు నివారణ సులభం అవుతుందని పేర్కొన్నారు. ఆక్సిజన్ కార్యక్రమంపై కూడా సమీక్షించారు. సింగరేణి కార్మికులు అందరికీ మే ఈ నెల ఆఖరికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకొని కో వీడు పేషెంట్లను గుర్తిస్తూ ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తూ వ్యాధి తీవ్రరూపం దాల్చకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు గత ఏడాది టీం వర్క్ తో కోవిడ్ వలన, సింగరేణి సంస్థ ఎక్కువ నష్టం జరగలేదని సింగరేణి తీసుకున్న ప్రత్యేక చర్యల కు కేంద్ర బొగ్గు మంత్రి శాఖ వారు ప్రత్యేక ప్రశంస తెలిపారు ఈ ఏడాది కూడా అదే ఒరవడితో ముందుకు పోవాలని సూచించారు. ఆస్పత్రులు కావలసిన ఇంజక్షన్లు మందులు ఎప్పటి కప్పుడు సమకూర్చడం జరుగుతుందని వివరించారు. విధినిర్వహణలో ఉన్న డాక్టర్ల కు సిబ్బందికి 10 శాతం అదనపు వేతనాన్ని చెల్లించడానికి యజమాన్యం సిద్ధంగా ఉందన్నారు అలాగే ఉత్పత్తి ఉత్పాదకత బొగ్గు నాణ్యత ప్రమాణాలు గూర్చి ఏరియా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విపత్తు పరిస్థితుల్లో రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతకు తీసుకోవాలని అన్నారు అధికారులకు తగు సూచనలను సలహాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ డైరెక్టర్ జిఎం ఎన్విరాన్మెంట్ రవి ప్రసాద్ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఎస్ ఓ టు జిఎం గోపాల్ సింగ్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

సింగరేణి ఏరియా హాస్పిటల్

 సింగరేణి ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన.. సింగరేణి డైరెక్టర్ ఎస్, చంద్ర శేఖర్

కార్మికులకు అత్యుత్తమమైన సేవలు అందిస్తాం


రామగుండం , పెన్ పవర్ 

శరవేగంతో కరోనా విజృంబిస్తున్న నేపధ్యంలో సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్&పా) ఎస్. చంద్ర శేఖర్ ఆర్జి-1  సింగరేణి ఏరియా హాస్పిటల్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్-వేవ్ కరోన పాజిటీవ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న పరిణామంలో దృష్ట్యా సింగరేణి హాస్పిటల్ లో చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగిందని ఏరియా హాస్పిటల్ లోని కరోనా ఐసోలేషన్ వార్డ్, కరోనా పరీక్షలు జరుపు ప్రదేశాలు, కరోన వ్యాక్సినేషన్ సెంటర్, ఐసియు గది, ఎక్స్-రే గది, ఏమర్జెన్సీ వార్డ్ లను పరిశీలించామని ఉద్యోగులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అవసరమైన మేరా ఆక్సిజన్ సిలిండర్ లను  అందుబాటులో ఉంచుకోవాలని  సూచించారు. ప్రతి ఒక్కరూ  కోవిడ్-19 వ్యాక్సిన్  వేసుకునేలా చర్యలను చేపట్టాలని అదే విధంగా  ప్రతి ఒక్క కార్మికుడు కూడ తప్పని సరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. కరోనా పరీక్షలు ఆర్టిపిసిఆర్, ర్యాపిడ్ పరీక్షలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అంతే కాకుండా కరోనా  పేషెంట్ లకు ఐ-సోలేషన్ వార్డ్ ల ఏర్పాటు చేశామని ఉద్యోగులు అధైర్య పడవద్దని మన సంస్థ సి&ఏండి  ఎన్ శ్రీధర్ ఐఏఎస్ ఎప్పటికప్పుడు అన్ని ఏరియాలలో  కరోనా  గురించి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అదే విధంగా హాస్పిటల్ లో మెడిసిన్ ను అందుబాటులో ఉంచుకోవాలని అలాగే డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రెండవ డోస్ తీసుకోవాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలను పాటించాలని  తప్పని సరి అయితే తప్ప మాస్ గ్యాదరింగ్ లకు వెళ్ళాకపోవటం మంచిది అని సింగరేణి వ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యలను చేపడుతున్నామని సానిటైజర్, మాస్కులను తప్పని సరిగా వాడాలని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమములో  ఆర్జి-1 జియం కె నారాయణ ఎస్ఓటూ జియం త్యాగరాజు, డివైసిఏంఓ కిరణ్ రాజ్ కుమార్, పర్సనల్ డిజియం రమేష్, రత్నమాల, యాదవ రెడ్డి, సంక్షేమాధికారి కందగడ్ల శ్రీనివాస్, సీనియర్  ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి  మరియు ఏరియా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా ది చెన్నై సిల్క్స్ అధినేత షష్ఠి పూర్తి వేడుకలు.

 ఘనంగా ది చెన్నై సిల్క్స్ అధినేత షష్ఠి పూర్తి  వేడుకలు.



కూకట్ పల్లి, పెన్ పవర్

 ప్రముఖ వస్త్ర, బంగారు నగల విక్రేత ది చెన్నై సిల్క్స్ మరియు శ్రీ కుమారన్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  పి.కే ఆర్ముగం దంపతుల షష్ఠి పూర్తిని పురస్కరించుకుని సోమవారం కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న షోరూమ్ వద్ద సిబ్బంది ఆధ్వర్యంలో సేవా కార్యక్రమలు నిర్వహించారు. కరోనా వైరస్ ఉదృతంగా విస్తరిస్తున్న వేళ  వైజంక్షన్ ట్రాఫిక్ కూడలి వద్ద  మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వారికి అవగాహన కల్పిస్తూ మాస్క్ లు అందజేశారు. ఈ సందర్భంగా ది చెన్నై సిల్క్స్ వై జంక్షన్ ఎ.జి.ఎం రమేష్ మాట్లాడుతూ తమ సంస్థ ఎం.డి పి.కే ఆర్ముగం దంపతుల షష్టి పూర్తి సందర్భంగా వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, రోడ్లపై నివసిస్తున్న పేదలకు, నిర్భాగ్యులకు ది చెన్నై సిల్క్స్, శ్రీ కుమారన్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తరుపున అన్నదానం కార్యక్రమాలు తో పాటు వారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పచ్చదనం పెంపొందించేందుకు  తమ షోరూమ్ కు విచ్చేసిన కొనుగోలుదారులకు మొక్కలను అందజేశారు. కొనుగోలు దారుల రక్షణను దృష్టి లో పెట్టుకొని షాపింగ్ మాల్ లో క్రమంతప్పకుండా సానిటైజేషన్ చేస్తున్నామని, కస్టమర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమకు కావాల్సిన దుస్తులు కొనుగోలు చేయవచ్చు అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మేనేజర్లు శరవణన్ , జోసెఫ్, వినయ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కరోనా భయంతొ తగ్గిన పుచ్చకాయ ల వ్యాపారం

 కరోనా భయంతొ తగ్గిన పుచ్చకాయ ల వ్యాపారం

 నష్టపోతున్న పుచ్చకాయ రైతులు, వ్యాపారస్తులు.

కేసముద్రం,  పెన్ పవర్

కడుపులో చల్లదనం మరియు ఆరోగ్యంను కల్గిస్తు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తిన దగిన వస్తువు భానుడి ప్రతాపం నుండి కాపాడే పుచ్చకాయ నేడు కొనే వారు కరువై రోడ్ల వెంబడి కుప్పలు, తెప్పలు గా దర్శనమిస్తూ,కరోనా భయంతో కొనేవారు కరువవడంతో   చిరు వ్యాపారులు మనోవేదన చెందుతున్నారు. గత సంవత్సరం కూడా ఇదే సీజన్లో కరోనా వైరస్ విజ్రుంభించిన తరుణంలో వ్యాపారం లేక నష్టపోయమని, మళ్ళీ ఈ సంవత్సరం ఇదే తరుణంలో వైరస్ వ్యాపించిన సందర్బంగా ప్రజలు బయపడి బయటకి రాలేకపోవడం వలన పుచ్చకాయ ల వ్యాపారం తగ్గి  తాము తీవ్రంగా నష్ట పోతున్నామని పుచ్చకాయ ల వ్యాపారస్తులు మనో వేదన చెందుతున్నారు

స్వరాష్ట్రంలో సింగరేణి అద్భుత ప్రగతి

 స్వరాష్ట్రంలో సింగరేణి అద్భుత ప్రగతి


మందమర్రి,  పెన్ పవర్

స్వరాష్ట్రంలో సింగరేణి సంస్థ అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని మందమర్రి జిఎం ఏరియా చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్స్, ఎస్ అండ్ పిసి విభాగం, 33 కెవి సబ్ స్టేషన్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అవిర్భవానికి ముందు, తర్వాత సంస్థ సాధించిన పురోగతిని సవివరంగా వివరించారు. సంస్థ పురోభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ, పార్కులను, క్యాంటీన్లను, రెస్ట్ రూములను, మినరల్ వాటర్ ప్లాంట్లను, కమ్యూనిటీ హాల్స్, యోగ కేంద్రాలను అత్యాధునికంగా నిర్మించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం గోపాల్ సింగ్, ఏరియా ఇంజనీర్ (ఏజిఎం) జగన్మోహన్ రావు, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షులు జక్కారెడ్డి, ఏరియా పిఎం వరప్రసాద్, ఎఎస్ఎం ఓదేలు, ఐఈడి (డిజిఎం) రాజన్న, వర్క్ షాప్ డిజిఎం నరసింహ రాజు, ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి భీమనాథుని సుదర్శన్, ఫిట్ కార్యదర్శి సిహెచ్పి శర్మ,, టీబీజీకేఎస్ ఏరియా నాయకులు ఇప్ప సమ్మయ్య, ఫిట్ కార్యదర్శి ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

ఆకాశాన్ని అంటిన చికెన్ ధరలు

 ఆకాశాన్ని అంటిన చికెన్ ధరలు..తగ్గిన వ్యాపారాలు..

పేదవాడికి చికెన్ తినడం కలగా మారుతున్న తరుణం..

 కేసముద్రం,  పెన్ పవర్

రాష్ట్రస్థాయి ఎండలు విజృంభిస్తున్న తరుణంలో బ్రాయిలర్ కోడి రేటు ఆకాశాన్ని అంటుతున్నాయి సామాన్యునికి అందుబాటులో లేక పోవడం అరకిలో కొన్ని సగటు మనిషి పావు కిలో కొనుక్కో పోతున్నాడు ఒకపక్క   కరోణ విజృంభిస్తున్న తరుణంలో మరోపక్క పిల్లలకు స్కూల్ లేక ఇంటిలోనే ఉంటున్నారు. వారానికి ఒక రోజు చికెన్ కొనుక్కొని తిందామనుకున్నా సగటు మనిషి ఆశలు ఆడియశలు గా మిగిలిపోతున్నది, గత పది రోజుల క్రితం 80 రూపాయలు ఉన్న కోడి నేడు 150 రూపాయలకు అమ్ముతున్నారు చికెన్ చికెన్ 180 కి అమ్మగా నేడు 260 కి అమ్ముతున్నాడు చికెన్ 200 రు అమ్మగా  280 రూపాయలకు పెరిగిందన్నారు.  దీనికంతటికీ కారణం బ్రాయిలర్ కోళ్ళు కోళ్ల ఫారం లో పెంచడం తగ్గిపోయిందని బ్రాయిలర్ కోడి పెంపకాలు లేకపోవడం అధిక ఉష్ణోగ్రత ఉండడంతో కోళ్ల షెడ్ ఖాళీగా ఉంచుతున్నామన్నా రు.  కోళ్ల ఫారం యజమానులు తెలియజేస్తున్నారు. గత పది రోజుల క్రితం ఉన్న గిరాకీ సగానికి పైగా పడిపోయాయని చికెన్ షాప్ యజమానులు తెలియజేశారు. ఇప్పటికే చిన్న చిన్న చికెన్ షాపులు మూతపడ్డాయని ఇలాగే ఉంటే షాపులు బంద్ చేసుకోవాల్సి వస్తుందని దానికి కారణం వ్యాపారాలు లేకపోవడం ఎండవేడిమికి కోళ్ళు సప్లై లేకపోవడం కారణమని చికెన్ షాప్ .యాజమానులు వాపోతున్నారు. ఏదేమైనా ధర తక్కువగా ఉంటేనే వ్యాపారం ఎక్కువ సాగుతుందని సగటు మనిషి ఒక్కపూటైనా కోడిమాంసం తింటారని వాళ్ల తింటేనే మా బ్రతుకులు బాగుంటాయని లేకపోతే మళ్లీ వేరే పనులు చేసుకొని బతకాల్సి వస్తోందని కేసముద్రం చికెన్ షాప్ యజమానులు తెలియజేశారు.

21వ డివిజన్ జయశంకర్ కాలనీ లో బ్రాండన్ సపిడ్ షంవే సంస్థ ఆధ్వర్యంలో బోరు మోటర్ ప్రారంభం

21వ డివిజన్ జయశంకర్ కాలనీ లో బ్రాండన్ సపిడ్ షంవే సంస్థ ఆధ్వర్యంలో  బోరు మోటర్ ప్రారంభం


పెన్ పవర్, జవహర్ నగర్ 

మునిసిపల్ కార్పోరేషన్ పరిధి 21డివిజన్ జయశంకర్ కాలనీ లో శనివారం బ్రాండన్ సపిడ్ షంవే సంస్థ వారు రావడం జరిగింది భూమా విజయ పౌల్ ఆధ్వర్యంలో బోర్ మోటర్ ను  ముఖ్యఅతిథి  డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి  శ్రీనివాస్ చేతుల మీదుగా   ప్రారంభించడం జరిగింది. బ్రండన్ షంవే సంస్థ  వారు  కాలనీ వాసులకు  కరోనా సెకండ్ వేవ్ గురించి అవగాహన కల్పించారు. కరోనా వైరస్ పట్ల  అప్రమత్తంగా ఉండాలని  ప్రజలందరూ  తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అని సూచించారు. అందులో భాగంగానే తొమ్మిదవ పదవ తరగతి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్, సంతూర్ సబులు, ఇవన్నీ కలిసి  ఒక కిట్టు రూపంలో ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో  మీరా  మేడం  ఊర్మిళ మేడం మేరి మేడం పాల్గొన్నారు. కాలనీ అధ్యక్షులు  కృష్ణ యాదవ్, భూమా పౌల్, ముకుందన్, రూబెన్, నరేష్, జక్కుల భాస్కర్ ,కావ్య, సౌందర్య, అంజయ్య, పుల్లయ్య చారి లక్ష్మి  తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు. 

15వ ఫైనాన్స్ నిధుల వినియోగంపై సమావేశం.

 15వ ఫైనాన్స్ నిధుల వినియోగంపై సమావేశం.

వెల్దుర్తి,  పెన్ పవర్

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం 15వ ఫైనాన్స్ నిధుల వినియోగంపై శనివారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎంపీపీ స్వరూప, జడ్పిటిసిరమేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 15వఫైనాన్స్ నిధులతో గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌళిక వసతుల కల్పనకు వినియోగించుకోవాలని ప్రజా ప్రతినిధులకు అధికారులు సూచించారు. అలాగే నిధుల వినియోగంపై  అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఏకశిలా రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డి

 ఏకశిలా రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డి

వినుయోగదారులకు నాణ్యమైన ఆహరం, సరసమైన ధరలకు అందించాలి - ఎమ్మెల్యే

ఇసిఐఎల్ లో పసందైన రాయలసీమ రుచులు


పెన్ పవర్,  మల్కాజిగిరి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ నియోజకవర్గం  చర్లపల్లి  డివిజన్  ఈసీఐఎల్ చౌరస్తా లో  శుక్రవారం ఏకశిలా మల్టీ క్యూషన్ రెస్టారెంట్(రాయలసీమ రుచులు), బంక్విట్ హాల్ ను ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డ, మాజీ పార్లమెంట్ సభ్యులు సముద్రాల వేణుగోపాలచారి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ  నాణ్యమైన ఆహారం సరసమైన ధరలకు అందించి ప్రజల మెప్పు పొందాలని ఆకాంక్షించారు.  ఏకశిలా రెస్టారెంట్ యజమాని బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రీతి లోకేష్ రెడ్డి లు మాట్లాడుతూ ఈసీఐఎల్ ప్రజలకు పసందైన రాయలసీమ రుచులకు ఏకశిలా రెస్టారెంట్ లో రాగిముద్ద, నాటుకోడి పులుసు, తలకాయ మాంసం, పాయ మొదలగు ప్రత్యేక రాయలసీమ వంటకాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, కాప్రా సర్కిల్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి రామ్మోహన్, జెర్రీ పోతుల  ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి దన్ పాల్ రెడ్డి, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, పాజ్జురి పావని మణిపాల్ రెడ్డి, టిఆర్ఎస్  సీనియర్ నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, సోలిస్ ఆస్పత్రి యజమాని రామాంజనేయులు, నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, బైరి రామ్ చందర్ గౌడ్, కొత్త అంజిరెడ్డి, బేతాళ బాల రాజు, నేమురీ మహేష్ గౌడ్,  జోనడ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమీకృత మార్కెట్ లను వెంటనే పూర్తి చెయ్యాలి

 సమీకృత మార్కెట్ లను వెంటనే పూర్తి చెయ్యాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాదు , పెన్ పవర్

పట్టణ ప్రగతి పనులు వేగం పెంచాలి. సమీకృత మార్కెట్ లను 6 నెలల్లో పూర్తి చేయాలి. మునిసిపాలిటీ లలో ప్రధాన జంక్షన్ ల అభివృద్ధి. సెంట్రల్ లైటింగ్,పచ్చదనం పై ప్రత్యేక దృష్టి. 15 రోజుల్లో ఒక్కో మునిసిపాలిటీ పై ప్రత్యేక సమీక్ష విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారని అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని 4 మునిసిపాలిటీ లలో ఇప్పటికే స్థలాలు గుర్తించటం జరిగిందన్నారు.మార్కెట్ కు వచ్చే కొనుగోలు దారులకు ప్రశాంత వాతావరణంలో అన్ని సరుకులు ఒకే దగ్గర కొనుగోలు చేసేలా ఉండాలన్నారు.ఇప్పటికే గజ్వేల్ లో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నూతనంగా ఎన్నికైన మార్కెట్ చైర్మన్ లు,కమిషనర్ లు,ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించడం జరిగిందన్నారు.అన్ని రకాల కూరగాయలు, ధాన్యం,పూలు,పండ్లు,వెజ్,నాన్ వెజ్ లాంటి అన్ని ఒకే దగ్గర లభించేలా ఈ మార్కెట్ లు ఉంటాయన్నారు.తినే పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ అమ్మకుండా,ఒక స్వచ్చమైన స్థలం లో ఉంచటమే ముఖ్యమంత్రి కేసీఆర్  లక్ష్యమన్నారు.పట్టణాల్లో నే ముందు 500 కోట్ల తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీ లలో సమీకృత మార్కెట్ లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి మునిసిపాలిటీ లో డంపింగ్ యార్డ్, వైకుంఠదామాల లను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.చెత్త తరలింపు ఆటో లు ఇప్పటికే అన్ని మునిసిపాలిటీ లలో అందుబాటులో కి వచ్చాయన్నారు. వికారాబాద్ మునిసిపాలిటీ లో ఎన్టిఆర్,బిజెఆర్ జంక్షన్ లను అభివృద్ధి పర్చాలని మంత్రి పేర్కొన్నారు. తాండూ

నెల్లికుదురు మండల ఇంపాక్ట్ ట్రైనర్ గా "కళ్యాణి" నియామకం

 నెల్లికుదురు మండల ఇంపాక్ట్ ట్రైనర్ గా "కళ్యాణి" నియామకం

నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా నెల్లి కుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన పెరుమాండ్ల కళ్యాణి నెల్లికుదురు మండలానికి ఇంపాక్ట్ ట్రైనర్ గా ఎంపికయ్యారు.ఈ మేరకు హైదరాబాదులో సోమవారం ఇంపాక్ట్ ఫౌండర్ అధినేత గంప నాగేశ్వరరావు నియామక పత్రాలను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ..ప్రతి ఇంటికి ఒక స్పీకర్ ఊరుకోక ట్రైనర్ ఉండేలా ఎదగాలన్నారు. ట్రైనర్ నియామకమైన  పెరుమాండ్ల కళ్యాణి మాట్లాడుతూ ఇంపాక్ట్ సంస్థ నుంచి జీవన నైపుణ్యాలు వ్యక్తిత్వ వికాస ట్రైనర్ గా నియమించడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. ఇది యువతకు జీవన నైపుణ్యాలను కమ్యూనికేషన్ స్కిల్ గురించి తెలపడానికి  ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆందోళన జీవితం నుండి బయటపడి యువత కు  కెరీర్ మీద  శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సంబంధిత సంస్థ ద్వారా ప్రపంచం లో ఎక్కడైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా భయం లేకుండా ప్రతి విషయం పై మాట్లాడానికి ఎంతోమందికి విషయాలు తెలియజేస్తున్నామని ఎందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ ట్రైనర్ ఆర్.కె.వి ప్రదీప్ శ్రీరామ్ శ్యామ్ రాథోడ్ సునీల్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.

బేల లో శనగ కొనుగోళ్లు ప్రారంభం

 బేల లో శనగ  కొనుగోళ్లు ప్రారంభం...

బేలా, పెన్ పవర్ 

 శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల  మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో శనగ కొనుగోళ్లు ప్రారంభమాయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మనోహర్ హాజరై మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, రైతులకు పెద్దన్నలా కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతుందని అన్నారు. మండల రైతులు నాణ్యమైన శనిగా తీసుకువచ్చి మద్దతు ధర తీసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్ని చట్టాలు వ్యతిరేకంగా తీసుకొచ్చిన,  తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన పోరాడి రైతులకు మద్దతు ధర ఇస్తుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఆడానేశ్వరా ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు జక్కుల మధుకర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్లెం ప్రమోద్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు  ఠాక్రే గంభీర్, టిఆర్ఎస్ నాయకులు వైద్య కిషన్, సంతోష్,జితేందర్, రఘు కూల్ రెడ్డి,  సతీష్,  సంతోష్, విపిన్, సుధాం రెడ్డి, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పెర్క్స్ పై ఐటీ మాఫీ చేయాలని సింగరేణికీ ఆదేశాలు జారీ చేయాలి

 రాష్ట్ర ప్రభుత్వం  పెర్క్స్ పై ఐటీ మాఫీ చేయాలని సింగరేణికీ ఆదేశాలు జారీ చేయాలి


మందమర్రి,  పెన్ పవర్

సింగరేణి కార్మికులకు పూర్తి ఐటి రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేశామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న పెర్క్స్ పై ఆదాయపు పన్ను రద్దు చేయమని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని కేకే 1 గనిపై నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన బంద్ పిలుపుకు బొగ్గు గని కార్మికులు మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులు కొనసాగిస్తున్న పోరాట స్ఫూర్తి తోనే కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మొదటి దశ బొగ్గు గనుల వేలం పాటలు పూర్తయ్యాయని, రెండోసారి వేలం పాటలు వేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదన్నారు. బొగ్గు గనుల వేలం వలన ప్రభుత్వ రంగాలైన కోలిండియా, సింగరేణికి కొత్త గనులు రాక పూర్తిస్థాయిలో ప్రభావం కోల్పోయే ప్రమాదం ఉందని, దాని ఫలితం వేజ్ బోర్డ్ పై కూడా పడే అకాశం కచ్చితంగా ఉంటుందన్ని పేర్కొన్నారు. ఇప్పటికే బొగ్గు రంగంలో ప్రైవేటు వారికి 34 శాతం పైగా వాటాలు  ఉండడం వలన వేతనాలు పెంపునకు వారు అంగీకరించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఒక వైపు ధరలు ఆకాశాన్నంటుతుంటే, కార్మికులకు పెంచాల్సిన డిఎ పెంచకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు వేలం పాటలకు అనుగుణంగా చట్టాలను మారుస్తుంటే వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తామేమీ తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తూ, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను పార్లమెంటులో వ్యతిరేకించకుండా, కనీసం రాష్ట్ర అసెంబ్లీ లోనైనా బొగ్గు గనుల వేలం పాటకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపకుండా, కొత్త గనుల అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి  తీసుకు రాకుండా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా సింగరేణిని కొల్లగొడుతున్నరని ఆరోపించారు.సింగరేణి కార్మికులకు 2021 సంవత్సరం క్యాలెండర్ ఇవ్వలేదని, ఇప్పటికే రిటైర్డ్ కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించలేదని, కార్మికులకు సిఎంపిఎఫ్ చిట్టిలు ఇవ్వలేదన్నారు. ఎన్ఓసి జారీలో జాప్యం తగ్గించి, ఏరియా జియంలకు అధికారాలు ఇవ్వాలని, నూతనంగా విధుల్లో చేరిన కార్మికులు స్పెషల్ ఆలవెన్స్ విషయంలో నష్టపోతున్నారని పేర్కొన్నారు. బొగ్గు గనుల సంరక్షణకు, సమస్యల పరిష్కారానికి కార్మికులు భవిష్యత్తులో కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపులకు మద్దతు తెలపాలని, ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని తెలిపారు. అనంతరం సింగరేణి లోని పలు సమస్యల పై కేకే-1 గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, నాయకులు గుళ్ల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

సమీక్ష సమావేశం నిర్వహించిన జోనల్ కమిషనర్

 సమీక్ష సమావేశం నిర్వహించిన జోనల్ కమిషనర్

కూకట్పల్లి, పెన్ పవర్

కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత శుక్రవారం ముసాపేటలోని తన కార్యాలయంలో స్వచ్ఛ హైదరాబాద్, ఆస్తిపన్ను వసూళ్ళు, మరియు ట్రేడ్ లైసెన్సు వసూళ్ళపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో స్వచ్ఛ సర్వేక్షన్ 2021కు సంబంధించిన బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతున్న సందర్భంగా జియుపిలు మరియు చెత్తకుండీలు తొలగించిన  ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. కూకట్ పల్లి జోన్ పరిధిలో పరిశుభ్రత విషయంలో తగు చర్యలు తీసుకోని స్వచ్ఛసర్వేక్షన్-2021లో మంచి స్థానం సాధించే విధంగా కృషి చేయాలన్నారు. అలాగే నూతనంగా వచ్చిన స్వచ్ఛ ఆటోలను ఇప్పటివరకు అందుబాటులో లేని ప్రాంతాలకు కేటాయించాలని ఎలాంటి విమర్శలు రాకుండా చూడాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై సమీక్షించి సహాయ వైద్యాధికారులు, లైసెన్స్ ఆఫీసర్లు, సహాయ లైసెన్స్ అధికారులు వారికి కేటాయించిన టార్గెట్ ప్రకారం లైసెన్స్ ఫీజులు వసూళ్లు చేయాలని లేని పక్షములో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్తిపన్ను వసూళ్లపై సర్కిళ్లవారీగా ఆరా తీసి టార్గెట్ ప్రకారం పన్ను వసూళ్లకు ఆయా సర్కిళ్ల ఉపకమిషనర్లు ప్రతిరోజు సంబంధిత అధికారులతో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటూ రోజువారీ టార్గెట్ ప్రకారం వసూళ్లు చేయాలని లేనిచో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా కమిషనర్ కు నివేదిక సమర్పించాలని హెచ్చరించారు. అలాగే ఆస్తిపన్ను బకాయిదారులందరు వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ లో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో రవీందర్ కుమార్, ప్రశాంతి, మంగతయారు, యాదయ్య, సంపత్ కుమార్, చంద్రశేఖర్, నిర్మల, శ్రీభాను ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

దేవరాపల్లిలో టమోటా రైతుల కంఠ కన్నీ

 దేవరాపల్లిలో టమోటా రైతుల కంఠ కన్నీరు.

సిండికేట్ అయిన దళారీ వ్వపారులు.

తగిన ధర రాక రైతులు ఆందోళన..

పెన్పవర్, విశాఖపట్నం

తరాలు మారిన రైతులు తలరాతలు మారలేదు అరుగాలం కష్టపడిన రైతు కంఠకన్నీరె మిగులుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు బుధవారం దేవరాపల్లి హొల్ సెల్ కాయగూరలు మార్కెట్ ను పరీశీలన చేసిరైతులు సమస్యలు అడిగాడు తెసుకున్న అనంతరం ఆయన వీలేకర్లుతో మాట్లాడారు దేవరాపల్లి హొల సేల్ కాయగూరలు మార్కెట్ కు మంచి పేరుందని ఒకప్పుడు దేవరాపల్లి ఓంకాయి ఒరిస్సా బరంపురం హైదరాబాద్ బెంగళూరులాంటి పట్టణ ప్రాంతలాకు వెళ్ళెదని తెలిపారు అటువంటిది ఇప్పుడు వ్యవపారులు సిండికేట్ అయ్యి పట్టణప్రాంతాలునుంఢి వ్యపారులును రాకుండా చేసి రైతులు నుండి తక్కవధరకు కోనుగోలు చేసి పట్టుకు పోయి అక్కడ వ్యవపారులుకు ఆమ్ముతున్నారని తెలిపారు దీనివలన దూరప్రాంతాలు నుండి వచ్చే వ్యవపారులు రాకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితిలో ఎంతో కోంతకు అమ్ముకోవలసి వస్తుందని తెలిపారు గతసంవత్సరం కరోనా వలన పండించిన పంటలు అమ్ముకోలెక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఈసంవత్సరం వ్యవపారులు సిండుకేటు అయ్యి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని తెలిపారు బైట మార్కెట్ లో టమోటా kg 30,40రూపాయలు అమ్ముతూఉంటె రైతులు నుండి 4,5 రూపాయలుకు మించి వ్యవపారులు కోనుగోలు చేయడం లెదంటే ఎంతదోపిడి జరుగుతుందో అర్దమౌతుందని తెలిపారు ఏన్నికలలో తేనె పూసిన కత్తిలాంటి తియ్యని మాయమాటలు చేప్పిన పాలకులు కష్టోల్లోఉన్న రైతులు కనిపించడం లేదన్నారు  రైతులకు మద్దతు ధర ఇస్తామని పాలకులు మాటల్లో నిజాలు లేవన్నారు రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోల్డ్ స్టోరీని నిర్మీస్తామని పాలకుల మాటలు నీటి మూటలుగా మారిపోతున్నాయని వెంకన్న తెలిపారు వెంటనే రైతులకు మద్దతు ధర ఇచ్చి అన్నిపంటలు ప్రభుత్వ మే కోనుగోలు చేయాలని ధళారీవ్యపారులునుండి రైతులకు రక్షణ కల్పించాలని మార్కెట్ సౌకర్యం కోల్డ్ స్టోరేజ్ ని నిర్మించాలని డిమాండ్ చేసారు .

ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ సెల్ ప్రారంభం

 ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ సెల్ ప్రారంభం 


కాగజ్ నగర్, పెన్ పవర్

జీవితంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగడానికి,  విద్యార్థి దశనుండే వారికి పారిశ్రామిక, వ్యాపార మెలకువలు అందించడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ సెల్ "ను ఏర్పాటు చేశారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు "ఎంటర్ ప్రెన్యూర్ షిప్" అంశంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కుమురం భీం జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎ.రవికృష్ణ మాట్లాడుతు విద్యార్థి దశనుండే విభిన్నంగా ఆలోచించడం అలవర్చుకుంటే ఏ రంగంలోనైన సులభంగా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు.విద్యార్థులు ఉపాధి పొందడం కాకుండా పది మందికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి.లక్ష్మీనరసింహం మాట్లాడుతు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు విద్యార్థి దశనుండే జీవితంలో రాణించడానికి కావలసిన నైపుణ్యాలను ఈ విభాగం ద్వారా అందించనున్నట్లు తెలిపారు.ప్రతి నెలలో ఒక పారిశ్రామిక వేత్త,వ్యాపార వేత్తల ద్వారా విద్యార్థులకు కావలసిన మెలకువలు అందించడంతో పాటు సమీపంలోని పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు సందర్శించి ప్రత్యక్ష అనుభవాలు పోందేలా ఈ విభాగం కృషి చేస్తుందని  తెలిపారు.ఈ కార్యక్రమంలో  వైస్ ప్రిన్సిపాల్ డి.జనార్ధన్, అధ్యాపకులు ఎం.రాజేశ్వర్, ఎస్.సునిల్కుమార్, ఎల్. మధుకర్ మధుకర్

పాల్గొన్నారు.

పాడిపరిశ్రమ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలి

పాడిపరిశ్రమ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలి

 పెన్ పవర్,కరప

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం సొమ్ములతోపాటు, బ్యాంకుల నుంచి రుణపరపతి పొందిన మహిళలు పాడి పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. మహిళల స్వయం ఉపాధికోసంఅమలు చేస్తున్న చేయూత పథకానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. కరప మండలం అరట్లకట్టలో మంగళవారం యూనియన్ బ్యాంక్ ద్వారా 33 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేసి, ఆయన మాట్లాడారు. బ్యాంక్ లోన్ ద్వారా పాడిగేదెలు కొనుగోలు చేసుకుని, అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ చేపట్టేవరకు పాలను బయట అమ్ముకోవాలన్నారు. పాడిగేదెలు పెంపకంవల్ల అదనపు ఆదాయం చేకూరడమేకాకుండా కుటుంబసభ్యులకు పాలడ్వారా పోషకాహారం లభిస్తుందన్నారు. 45 ఏళ్లనుంది అని ఏళ్ల లోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు చేయూత పడకంలో మొదటి విడతగా రూ.18.750 లు ఇవ్వడం జరిగిందని, దీనికి బ్యాంకులద్పారా రూ 56250 లు లోన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మొత్తం రూ 15 వేలతో పాడిగేదెలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఏటా వచ్చే చేయూత సామ్మును ద్యాంకులోన్కు జమవుతుందన్నారు. ముందుగా బ్యాంక్ లో జేయాతవధకంలో ఇచ్చే లోన్ డాక్యుమెంటేషన్ ప్రాసెసిను పరిశీలిందారు, చేయూత పధకం ఉదేశాన్ని కరెర్ మురళీధర్ రెడ్డి లబిచారులకు వివరించి, ఈవధకాన్ని ఎలా వినియోగించు కుంటారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యాంకులో ఇవ్వని విధంగా అత్యధికంగా లోన్లు మంజూరు చేసినందుకు, 138 మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేసినందుకు యూనియన్ బ్యాంక్ ఆరట్టకట్ట బ్రాండ్ మేనేజర్ టి.కమలాకరరావును కలెక్టర్ మురీధర్రెడ్డి అడినందంచి, పత్కనిండారు. గ్రామసర్పంచ్ గోపి సత్యవేణి, ఎంపీడీక, కర్రె స్వప్న, చెలుగు పీడీ వై.,హరనాధ్, పకుసంపర్షకకాఖ జేడీ డాక్టర్ ఎన్ టీ శ్రీనివాసరావు, ఎడీ డాక్టర్ సురేష్ బాబు, వెలుగు ఏసీ ఆకోక్లటగరత్ ఎపీఎం టి.మురకళీక్ృష్ణ ఎం కె.బల్లి కృష్ణవేణి, ఈఓపీఆర్ సీహెచ్ కాలాలు వెంకటరమణ, వెటర్నరీ డాక్టర్లు రంజిత్ సింగ్, దీవివెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...