Followers

Showing posts with label AGRICULTURE. Show all posts
Showing posts with label AGRICULTURE. Show all posts

ఈనెల 5న సోయా విక్రయ కేంద్రం ప్రారంభం

ఈనెల 5న సోయా విక్రయ కేంద్రం ప్రారంభం...

జైనథ్ , పెన్ పవర్ 

ఆదిలాబాద్ జిల్లా జైనథ్  వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 5వ తేదీన ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా సోయాబీన్ విత్తనాల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించ నున్నట్లు పి.ఏ.సి.ఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.  మంగళవారం జైనథ్ మండల నాయకులతో చర్చించిన అనంతరం ఈ విక్రయ కేంద్రం తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో 1000 బ్యాగ్ ల కరిష్మా సోయాబీన్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమున్న రైతులు ఈనెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు మార్కెట్ యార్డ్ లోని విత్తన విక్రయ కేంద్రానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో  ఎంపీపీ మరిశెట్టి గోవర్ధన్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లింగా రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఏవో వివేక్ తదితరులు పాల్గొన్నారు. 

గిరిజన యువతకు ఉర్లోనే ఉఫాది అవకాశాలు

 గిరిజన యువతకు ఉర్లోనే ఉఫాది అవకాశాలు

పెన్ పవర్, విశాఖపట్నం

నిరుద్యోగులు ఉపాధి కోసం ఊర్లు వదల కుండా స్థానికంగా ఉపాధి పొందే విదంగా గిరిజన యువతకు శిక్షణ ఇస్తున్న మని ఆదివాసీ మిత్ర వెల్పేర్ సొసైటీ సిఈఓ తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువత  ఆర్థిక స్తొమత లేక అరకొర  చదువులతో ఉపాధి రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణలు యువతకు తగిన అవకాశాలు అందక ఇంటి బాట పడుతున్నారు.చాలీచాలని వేతనం, పొందిన శిక్షణకు తగ్గ ప్లేసెమెంట్ చూపించకపోవడం తో యువత కష్టాలు ఎదుర్కొన్నారు. ఉన్న ఊర్లో నే మెరు గైన  ఉపాధి అందుకునేలా యువత కు పదును పెడుతున్నారు.

 గ్రామాలలో నిరుద్యోగులుగా ఉండి అగ్రోబేసెడ్ మీద ఉత్సహంగా ఉన్న యువతను 3 మండలాలు పాడేరు, హుకుంపేట, పెదబయలు నుండి 200 మంది యువతను గుర్తించి గ్రామాలలో ఉన్న యంగ్ ఫార్మర్లును ప్ప్గ్ గ్రూప్లలో చేర్పించి ఆ యువతను ఆదివాసీమిత్ర వెల్ఫేర్ సొసైటీ గుర్తించి మోడల్ ఫార్మ్, నర్సరీ, మష్రూమ్ కల్టివేషన్, ఫ్లోరి కల్చర్ పై శిక్షణలు ఇప్పించి యువతతో మార్కెటింగ్ హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గుమ్మడిగుండువా గ్రామంలో శ్రీలక్మి గ్రూప్ సభ్యులు చీపుర్లు మార్కెటింగ్ చెయ్యడం జరిగింది. అలాగే పెదబయలు మండలం, పెదకొడపల్లి పంచాయతీ, జైతికోట గ్రామానికి చెందిన సీదరి భీమేశ్వరరావు యువత పుట్టగొడుగుల పెంపకంపై ఆదివాసీమిత్ర సంస్థ ద్వారా శిక్షణ పొంది ఆదివాసీమిత్ర సహాయంతో ఎఎస్ట్రేం పుట్టగొడుగుల పెంపకం చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. భవిష్యత్తులో యువతకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఆదివాసీమిత్ర సీఈఓ గారు చెప్పటం జరిగింది.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం

 రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం


 రైతుల కోసం గుజ్జు పరిశ్రమల యజమానులు అంగీకరించారు
 రోజుకు 500 మెట్రిక్ టన్నుల టమోటోలు కొనుగోలు కు సిద్ధం
 టమోటాల సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి 
చిత్తూరు,  పెన్  పవర్

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు మరోసారి  గుజ్జు పరిశ్రమ యజమానులతో ఉద్యానవన శాఖ మార్కెటింగ్ శాఖల అధికారులు నేడు జరిపిన చర్చల్లో రోజుకు ఐదు వందలు మెట్రిక్ టన్నుల టమోటాలను కొనుగోలు చేసేందుకు అంగీకరించారని ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు పరిశ్రమ యజమానులతో కలెక్టరేట్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో లో రైతుల వద్ద నుంచి నేరుగా ఫ్యాక్టరీలు టమోటాలను కొనుగోలు చేస్తాయని అదేవిధంగా కొనుగోలు చేసిన టమోటా లకు సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుందని ఇందుకు సంబంధించి ఏపీ మహిళా సంఘాల సమాఖ్య వారు కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహిస్తారు అని ఆయన అన్నారు. అదేవిధంగా మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు సుధాకర్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు టమోటాలను పంపడం జరుగుతుందని అలా పంపిన టమోటాలను గుజ్జు చేసి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు వివిధ మార్కెట్లలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించినట్లు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల తరపున గోవర్ధన్ బాబీ మాట్లాడుతూ ప్రస్తుతం మామిడిపండ్ల సీజన్ మొదలు అయినా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు అందరూ సహకరించడం ఆనందమని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ గుజ్జు పరిశ్రమల యజమానులతో టేలికాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు  సుధాకర్, ఏ డి ఇందుమతి,ఉద్యాన వనశాఖ డి డి శ్రీనివాసులు, ఏ పి మాస్ వినాయక రెడ్డి, గుజ్జు పరిశ్రమ యజమానులు పాల్గొన్నారు.

తాడిపూడిలో పంటకోత ప్రయోగం

తాడిపూడిలో పంటకోత ప్రయోగం

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో శనివారం వరి పంటకోత ప్రయోగం జరిగిందని మండల వ్యవసాయ అధికారిణి జి.రుచిత తెలిపారు. పంటకోత దిగుబడిపై రైతు గుర్రాల వెంకన్న పొలంలో వరిపంటపై కోత ప్రయోగం నిర్వహించగా సరాసరి ఎకరానికి పంట దిగుబడి సుమారు 48 నుండి 50 బస్తాలు వరకు దిగుబడి వచ్చిందని తెలిపారు. జి.రుచిత మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో  రైతులు ధాన్యం నిలువలు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు తరలించవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో విఆర్వో ఎం.ప్రకాష్, విఏఏ లు ఈశ్వర్, భార్గవ్, రైతు గుర్రాల వెంకన్న పాల్గొన్నారు.

ఆక్వా చెరువులకు అందరు లైసెన్సులు కలిగి ఉండాలి

ఆక్వా చెరువులకు అందరు లైసెన్సులు కలిగి ఉండాలి 




పెన్ పవర్,కొవ్వూరు

దేవరపల్లి మండలం తాసిల్దారు వారి కార్యాలయంలో  మత్స్య శాఖ సహాయ సంచాలకులు బి.సైదా నాయక్ ఆధ్వర్యంలోజిల్లా స్థాయి కమిటీ వారి ఆదేశాల ప్రకారం మండల స్థాయి అధికారులకు ఆక్వా చట్టం 20 20 ఆంధ్రప్రదేశ్ చట్టం మరియు ఆంధ్రప్రదేశ్ చేపల మేతల చట్టం లపై మండల స్థాయి కమిటీ సభ్యులకు కొవ్వూరు మత్స్య శాఖ సహాయ సంచాలకులు సైదా నాయక్ అవగాహన కల్పించారు. కొత్తగా వచ్చిన ఆక్వా చట్టం ప్రకారం శాశ్వత ఆక్వా రైతులు లైసెన్సులు పొందాలి అని సూచించారు. కొత్త చట్టం ప్రకారం పాత లైసెన్స్ కలిగిన వారు మే 30 వ తారీఖు లోగా రెన్యువల్ చేయించుకోవలెను. లైసెన్స్ పొందని చెరువులు మరియు కొత్తగా చేరువులు త్రవ్వుకొనుటకు  సంబంధిత పత్రాలు అనగా ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్కు ,80% వాటర్ లైట్ ఏరియా సెర్టిఫికెట్, గూగుల్ క్యాడ్ మ్యాప్, ఎకరానికి 1000రూపాయల చొప్పున ఫీజుతో గ్రామ సచివాలయం, మత్స్య శాఖ సహాయకులు (వి.ఎఫ్.ఏ) లను సంప్రదించవలెను. జూన్ 30 లోగా ఆక్వా లైసెన్స్ పొందిన వారి చెరువులను ధ్వంసం చేయబడును అని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, ఎంపీడీవో, అటవీశాఖ అధికారి, మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారి వి. దేవానందం మత్స్యశాఖ సహాయకులు ఏ.శాంతి, టి. చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యం

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యం

👉ఫ్యాక్టరీ యజమానులు స్పందించాలి
👉రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది
👉టమోటాకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పరిశ్రమలు సహకరించాలి
👉 రానున్న పది రోజుల్లో మరింత ఉత్పత్తి వచ్చే అవకాశం ఉన్నందున క్రషింగ్ ప్రారంభించాలి

 

చిత్తూరు,  పెన్ పవర్

చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పడమటి ప్రాంతాలలో టమోటా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా భావించిందని ఫ్యాక్టరీ యజమానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో గుజ్జు పరిశ్రమల యజమానులు మార్కెటింగ్ శాఖ అధికారులు మరియు ఉద్యానవన శాఖ అధికారులతో టమోటా ధరలపై జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలు సుమారు 6,800 హెక్టార్లలో టమోటా పంటను సాగు చేస్తున్నారని ఈ రోజు 600 మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి మార్కెట్లోకి వస్తున్నదని ఇందులో ప్రధానంగా మదనపల్లె మార్కెట్ కు మూడు వందల మెట్రిక్ టన్నుల వస్తుండగా పుంగనూరు పలమనేరు కలికిరి గుర్రంకొండ ములకలచెరువు ప్రాంతాలలోని మార్కెట్లకు మిగిలిన టమోటా ఉత్పత్తులు రావడం జరుగుతున్నాయని అయితే ఇతర రాష్ట్రాలలో కూడా భారీ ఎత్తున ఉత్పత్తి ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం కలగకుండా గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో తగు చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందుకోసం మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు మరి కొన్ని రోజుల పాటు టమోటా గుజ్జు తయారు చేయాలని అలా చేయడం ద్వారా రైతులకు కొంతవరకైనా గిట్టుబాటు ధర కల్పించినట్లు అవుతుందని అన్నారు. దీనికి సంబంధించి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు తరఫున గోవర్ధన్ బాబీ మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 45 పరిశ్రమలు ఈ సీజన్లో మామిడి గుజ్జును తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం అన్ని యంత్రాలను ఓవర్ ఆయిలింగ్ చేసుకుంటున్నారని ఇప్పటికే 1.25 లక్షల మెట్రిక్ టన్నుల టమోటాను కొనుగోలు చేసి గుర్తుగా తయారు చేయడం జరిగిందని ఇప్పటికే మామిడి పళ్ళు విజయవాడ ప్రాంతం నుంచి రావడం జరిగిందని అన్నారు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ యజమానులు అందరూ రైతులు కాబట్టి రైతుల సమస్యలు తెలుసు కోవడంతో పాటు వారికి కూడా తమ వంతు పాత్ర గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. 

ఈ సందర్భంగా గుజ్జు పరిశ్రమలో పెద్దవి 10 ఫ్యాక్టరీలు ఉన్నాయని ఇందులో లో ఒక లైన్ టమోటా గుజ్జు తయారు చేసేందుకు అందరినీ ఒప్పించడం చేయాలని ఫ్యాక్టరీ యజమానులు కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటంవల్ల వారితో చర్చించి తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ నిర్ణయానికి సహకరిస్తామని అన్నారు. మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ ఉత్పత్తులు అవ్వడం వల్ల మరియు కరోనా పరిస్థితులవల్ల ఇతర ప్రాంతాలకు పోలేని పరిస్థితులు రావడం జరిగిందని అయితే ఇతర ప్రాంతాల్లో కూడా టమోటాలు భారీగా ఉత్పత్తి కావడంతో అక్కడ కూడా ధరల పతనం అయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇప్పటికే కొంత వరకు కొనుగోలు ప్రారంభించి రైతు బజారు కు పంపడం జరిగిందని అయితే ఉత్పత్తులు ఎక్కువగా ఉండడంతో ఫ్యాక్టరీ యజమానులు సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గుజ్జు పరిశ్రమల యజమానులు మరి కొందరు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యజమానులతో చర్చించి శనివారం సాయంత్రం లోపు నిర్ణయం తీసుకొని సోమవారం నుంచి టమోటా గుజ్జు తయారు చేసేందుకు పరిశ్రమలను సిద్ధం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దమయంతి పరిశ్రమల యజమానులు,మార్కెటింగ్, ఉద్యనవనశాఖ అధికారులు పాల్గొన్నారు.

అమ్మాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అవస్థలు

 అమ్మాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అవస్థలు

సన్న వడ్లు కొనుగోలు చేయకా, రోజుల తరబడి నిరీక్షణ.

తాలూ, తేమ పేరుతో రైతులను మోసం చేయొద్దు. 

మిల్లు యజమానుల పక్షాన నిలబడి, మాపొట్ట కొట్టొద్దు.

సన్న వడ్లను కొనుగోలు చేసి,మాకు న్యాయం చేయాలని, అమ్మాపురం గ్రామ రైతుల ఆవేదన. 


తొర్రూరు, పెన్ పవర్

ధాన్యం కొనుగోలు కేంద్రంలో సన్న వడ్లను తీసుకోవడం లేదని, ధాన్యం బాగాలేదని తాలు పేరుతో రైతులను మోసం చేయొద్దని, మిల్లు యజమానులు పక్షాన కొనుగోలు కేంద్రాలను అధికారులు నిలబడి, వారికి లాభాలను చేకూర్చుకుంటూ రైతుల పొట్ట కొట్టవద్దని, రైతులు ఆరోపిస్తూ... ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఆమ్మాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సన్న వడ్లు (సన్నలు) తీసుకోవడం లేదని, రైతులు మండి పడ్డారు.ఈ సందర్భంగా రైతులు మార్క రాములు గౌడ్, మాచర్ల శంకరయ్య గౌడ్, మంగ్యా నాయక్ లు మాట్లాడుతూ...  కొనుగోలు కేంద్రానికి సన్న ధాన్యం తీసుకొచ్చి, పది రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. సన్న ధాన్యాన్ని మీ వాహనంలో మీరే మిల్లు దగ్గరికి తీసుకు వెళ్ళాలని, కొనుగోలు కేంద్రం వారు అంటున్నారని, రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రంలో క్వింటాకు ఒక కిలో కటింగ్ ఉంటుందని, అన్నారు. కాని మిల్లుకు వెళ్లిన తర్వాత 2 నుంచి 3 కిలోలు తరుగు తీస్తున్నారని,శాంపిల్ తీసుకెళ్లినప్పుడు మాత్రం పరవాలేదు బాగానే ఉంది. తీసుకురండి అంటున్నారు. కాని అక్కడికి వెళ్ళిన తర్వాత 2 నుంచి 3 కిలోలు తరుగు తీయడం ఏమిటని, రైతులు ప్రశ్నిస్తున్నారు.సన్నలు పెట్టమని ప్రోత్సహించిన ప్రభుత్వమే సన్న వడ్లను తీసుకోవడం లేదని, రైతులను మోసం చేయడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక క్వింటాకు 35 రూపాయలు కూలి ఉంటే 40 నుంచి 50 రూపాయలు తీసుకుంటున్నారన్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మిల్లుల యజమాన్యం లాభపడే విధంగా కాకుండా రైతులకు నష్టం జరగకుండా రైతుల పక్షాన నిలబడి రైతులు నష్టపోకుండా చూడాలని వారు కోరుకుంటున్నారు.

రికార్డ్ స్థాయిలో రబి ధాన్యం ఉత్పత్తి

 రికార్డ్ స్థాయిలో రబి ధాన్యం ఉత్పత్తి

ఎమ్మెల్యే శంకర్ నాయక్.

మండలం లో 3కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


నెల్లికుదురు, పెన్ పవర్

దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడడానికి దాణ్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.మహుబూబాబాద్ జిల్లా  నెల్లికుదురు పిఎసిఎస్ పరిధిలోని నైనాల,నెల్లికుదురు కొనుగోలు కేంద్రాలను, శ్రీరామగిరి పరిధిలోని ఆలేరు సెంటర్ ను ఆయా సొసైటీల చైర్మన్లు కాసం లక్ష్మీ చంద్రశేఖర రెడ్డి, గుండా వెంకన్న లతో కలిసి ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో రబీ ధాన్యం రికార్డు స్థాయిలో పండిందని ఇందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కాలే శ్వరం తో పాటు వివిధ జలాశయాలను నిర్మించి నీటిని విడుదల చేయడమే అన్నారు.కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా మోసాల నుంచిరైతులకు  విముక్తి కలుగుతుందన్నారు. అందుకే కర్షకులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు రైతు బీమా 24 గంటల ఉచిత కరెంటు ప్రాజెక్టు నిర్మాణం చేసి నీటిని విడుదల చేయడం చేస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని అన్నారు.కరోనాపై మాట్లాడుతూ ..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ఎవరికివారు భౌతిక దూరం స్వీయ రక్షణ మాస్కులు ధరించడం శానిటైజర్ లు వాడడం ఇళ్ళలో ఉంటూ ఫంక్షన్లకు దూరంగా ఉండడం తదితర జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు యాదగిరిరెడ్డి చింతకుంట్ల యాకయ్య బిక్కు నాయక్  రైతు బంధు సమితి జిల్లా మండల కోఆర్డినేటర్లు బాలాజీ నాయక్ వెంకటేశ్వర రెడ్డి పీఏసీఎస్ చైర్మన్లు కాశం లక్ష్మి చంద్రశేఖర్రెడ్డి గుండా వెంకన్న వైస్ చైర్మన్ భోజ్యనాయక్,టిఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పరిపాటి వెంకట రెడ్డి యాసం రమేష్, నాయకులు కాలేరు శ్రీనివాస్,గుదే వీరరన్న గౌడ్,మీడియా ఇంచార్జ్ కసర బోయిన విజయ్ యాదవ్ దండం పల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. 


 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బుగ్గ కృష్ణమూర్తి

 ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బుగ్గ కృష్ణమూర్తి...

వ్యవసాయ సహకార సంఘం తిమ్మాపూర్ ఉపాధ్యక్షుడు బుగ్గ కృష్ణమూర్తి.

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  తిమ్మపూర్ ఆధ్వర్యంలో  యాసంగి- 2021 వరి ధాన్యం కొనుగోలు కేంద్రం గొల్లపల్లి లో సంఘ ఉప అధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి,  ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప అధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి, మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతాయి ఎలాంటి అవకతవకలు లేకుండా    చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.సెంటర్లలో సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతు కరోనా వైరస్ తో అప్రమత్తంగా ఉండలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఎంపీటీసీ ల్యాగాల శ్రీనివాసరెడ్డి, ఉపసర్పంచ్ పెంజర్ల దేవయ్య, ఎండి జబ్బార్, ఏ ఈ ఓ ముకుందాం, సంఘ డైరెక్టర్ లు పెండ్యాల సంతోష్ రెడ్డి, పెంజర్ల నారాయణ, గుర్రాల సతిరెడ్డి, సీఈఓ శశివర్ధన్, సంఘ సిబ్బంది గ్రామ రైతులుహమాలి సభ్యులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు

 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన  గ్రామ  సర్పంచ్ కటకం శ్రీధర్ 

సహకార సంఘం  ఉపాధ్యక్షుడు  ఆంజనేయగౌడ్ 

గంభీరావుపేట  , పెన్ పవర్ 

గంభీరావుపేట  మండలం సోమవారం  గంభీరావుపేట మండల కేంద్రం లో  ప్రాథమిక సహకార సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ , సహకార సంఘం ఉపాధ్యక్షులు  ఆంజనేయగౌడ్   ఆధ్వర్యంలో  వరిధాన్యం  కొనుగోలు కేంద్రాన్ని   ప్రారంభించారు   ముందుగా  కరోనా  సెకండ్  వేవ్  ఎక్కువ గా  విజృంబిస్తున్న  అందువల్ల  రైతులు ప్రభుత్వం నిబంధనలు  పాటిస్తూ రైతులు మరియు  హమాలీ సోదరులు   వాళ్ళు పలు  జాగ్రత్తలు పాటించాలి  మాస్క్ లు  ధరించాలి. సామాజిక దూరం పాటించాలి శానిటైజర్ వాడాలి ,తెలిపారు. తెలంగాణా  రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు, ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్  రైతులకు దగ్గర గా వరి ధాన్యం  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు  చేసినా మన  ప్రాంత ప్రజలు   ప్రాంత రైతులపక్షాన పాలకవర్గం తరుపున పాదాభివందనం తెలిపారు. వరి ధాన్యం కు కనీస మద్దతూ ధర  ఏ ) గ్రేడ్  1888/-   బి ) గ్రేడ్   1868 /- రూ" ధాన్యం లో  రాళ్లు  , పొల్లు, తాళ్లు, ఇవి  లేకుండా  చూసుకోవాలి   పండించిన పంట  కల్లాము వద్దనే ఆరబెట్టుకోవాలి మ్యాచర్   వచ్చాక  సెంటర్ వద్దకు తీసుకొని రావాలి   తేమ  శాతం  17 %  కంటే  తక్కువ ఉండునట్లు  చూసుకొవాలి రైతులకు తెలియజేయడమైనది. గ్రామం లోని  రైతులు ఇబ్బంది పడవద్దని గ్రామంలో వరిధాన్యం  కొనుగోలు  కేంద్రాలను  ఏర్పాటు చేసిన  తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల  చంద్రశేఖర్ రావు ,ఐటీ  శాఖమంత్రి  తారక రామారావు,టెస్కాబ్  చేర్మెన్  కొండూరు రవీందర్ రావు,   ప్రాంత రైతుల పక్షాన పాలకవర్గం పక్షాన  కృతజ్ఞతలు  తెలిపారు. కార్యక్రమం లో   గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ ,సహకార సంఘం ఉపాధ్యక్షుడు  ఆంజనేయగౌడ్ , వైస్ ఎంపీపీ దోశల లత, రైతు బందు కోఆర్డినేటర్ కె,  బాలకిషన్ రావు,  రాజు , తెరాస నాయకులు  డైరెక్టర్లు , వార్డు సభ్యులు రైతులు హమాలీ సోదరులు,  తదితరులు  పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన ఎంపీడీఓ, ఏపిఓ

 ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన ఎంపీడీఓ, ఏపిఓ...

నార్నూర్,  పెన్ పవర్ 

నార్నూర్ మండలం లోని నాగల్కొండ, ముక్తాపూర్, మారపాగూడ, గ్రామ పంచాయతీ క్షేత్ర స్థాయి లో కొనసాగుతున్న  ఉపాధి హామీ పనులను శనివారం ఎంపీడీఓ రమేష్, ఏ పి ఓ జాదవ్ శేషరావు,తో కలిసి పనులను  తనిఖీ చేశారు. జాబ్ కార్డు లో ఉన్న ప్రతి ఒకరికి  ఉపాధి కలిపించాలని కార్యదర్శి లను ఆదేశించారు. మాస్టర్ రోల్ లో నమోదు చేసిన  కూలీల హాజరును పరిశీలించారు. పని చేయని కూలీల పేర్లు మాస్టర్ రూల్ లో నమోదు చేస్తే చర్యలు తప్పవని కార్యదర్శులకు టీఏ లకు హెచ్చరించారు.వారి వెంట పంచాయతీ సెక్రటరీ లు, టీ ఏ లు, కూలీలు ఉన్నారు.

రైతులకు మద్దతు ధర కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

 రైతులకు మద్దతు ధర కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

రైతుబంధుసమితి కో ఆర్డినేటర్ దేశబోయిన శ్రీశైలం.

నెల్లికుదురు , పెన్ పవర్

రైతులకు మద్దతు ధర కల్పించడమేతెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మునిగలవీడు రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ దేశబోయిన శ్రీశైలం అన్నారు. శుక్రవారం మండలంలోని మునిగలవీడులో సిరివెన్నెల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(ఐకెపి) శుక్రవారం ఆయన  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. దళారీ వ్యవస్థ ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసినట్లు శ్రీశైలం తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నరేంద్ర కుమార్, మాజీ సర్పంచ్ పట్నం శెట్టి నాగరాజు, సిసి బొడ్డు వెంకటేశ్వర్లు, నల్లని పాపారావు, సిరివెన్నెల, త్రివేణి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ఆకారపు జమున, ఎండి.రజియా, ఆశాబీ, వీఓఏలుజెల్లాకవిత, తుప్పతూరిమంజుల తో పాటు రైతులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగిల్ విండో చేర్మెన్

 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని   ప్రారంభించిన సింగిల్ విండో చేర్మెన్ 

గంభీరావుపేట, పెన్ పవర్ 

 గంభీరావుపేట  మండలం శుక్రవారం   కొత్తపల్లి  గ్రామం లో   సింగిల్ విండో చేర్మెన్  భూపతి సురేందర్  ఆధ్వర్యంలో  వరిధాన్యం  కొనుగోలు ముందు జాగ్రత్త   కరోనా  సెకండ్  వేవ్   విజృంబిస్తున్న  తరుణంలో  రైతులు ప్రభుత్వం నిబంధనలు  పాటిస్తూ రైతులు మరియు  హమాలీసోదరులు   వాళ్ళు పలు  జాగ్రత్తలు పాటించాలి  మాస్క్ లు  ధరించాలి. సామాజిక దూరం   పాటించాలి శానిటైజర్  వాడాలి , తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు,  మండు టెండల్లో  ఎండ కాలం లో కాళేశ్వరం జలాలను కొండా పోచమ్మ ప్రాజెక్టు ద్వారా  కూడెల్లి వాగు ద్వారా ఎగువ మానేరు  నింపినందుకు ప్రాంత రైతులపక్షాన పాదాభివందనం తెలిపారు. కరోనా నుండి  త్వరగా కోలుకోవాలని అన్నారు. కనీస  మద్దతూ ధర  ఏ ) గ్రేడ్  1888/-   బి ) గ్రేడ్   1868 /- రూ" ధాన్యం లో  రాళ్లు  , పొల్లు, తాళ్లు, ఇవి  లేకుండా  చూసుకోవాలి  తేమ  శాతం  17 %  కంటే  తక్కువ ఉండునట్లు  చూసుకొవాలి రైతులకు  తెలియజేయడమైనది  గ్రామం లోని  రైతులు ఇబ్బంది పడవద్దని గ్రామంలో వరిధాన్యం  కొనుగోలు  కేంద్రాలను  ఏర్పాటు చేసిన  తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల  చంద్రశేఖర్ రావు , ఐటీ  శాఖమంత్రి  తారక రామారావు,టెస్కాబ్  చేర్మెన్  కొండూరు రవీందర్ రావు,   ప్రాంత రైతుల పక్షాన పాలకవర్గం పక్షాన  కృతజ్ఞతలు  తెలిపారు. కార్యక్రమంలో  సంఘం అధ్యక్షుడు ఎ. రాజనర సింహారెడ్డి,  ఉపాధ్యాక్షులు గాండ్ల  రాజాం  సంఘం  డైరెక్టర్లు  జోగునర్సయ్య , వంగ దామోదర్ రెడ్డి, వంగా  శ్రీనివాస్ రెడ్డి,  పాతూరి  బాల్ రెడ్డి, మ్యాకల  యశోద, గౌరీ నేని   భగవంత రావు,  గౌరినేని   నారాయణ రావు, సి ఈ ఓ  రాజయ్య ,  సంఘం  సిబ్బంది తదితరులు   పాల్గొన్నారు.

విద్యుద్ ఘాతంతో పాడి గేదె మృతి

 విద్యుద్ ఘాతంతో పాడి గేదె   మృతి

60 వేల వరకు నష్టపోయిన రైతు.

 ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలని రైతు వేడుకోలు.

తొర్రూరు, పెన్ పవర్

విద్యుద్ ఘాతంతో పాడి గేదె మృతి చెందిన ఘటన మహబూబాద్ జిల్లా తొర్రూరు  మండలంలోని బొజియ తండా గ్రామ శివారు ఈదుల కుంట తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొజియా తండా శివారు ఈదుల కుంట తండాకు చెందిన బానోతు నెహ్రూ పాడి గేదెను పచ్చిక మేపేందుకు వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లాడు. మేత మేసే క్రమంలో విద్యుత్ తీగలకు గేదె తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. రోజు 5 లీటర్ల పాలు ఇచ్చే పాడిగేదె విలువ సుమారు 60 వేలు ఉంటుందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత రైతు నెహ్రూ వేడుకున్నాడు. గేదె మృతి చెందిన సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ మాలోత్ కాలు నాయక్ సందర్శించి, బాధితులను ఓదార్చారు.

రైతులు ప్రత్నామ్నాయ పంటలు వేయాలి

 రైతులు ప్రత్నామ్నాయ పంటలు వేయాలి

వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్

బెల్లంపల్లి , పెన్ పవర్

రైతులందరు కూడా ఒకే పంటలను కాకుండా ప్రత్యామ్యాయ పంటలు వేయాలని బెల్లంపల్లి వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామంలో కెత్రప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారులు గ్రామంలోని పల్లి సాగు చేసే క్షేత్రాలను సందర్శించారు. అకేనేపల్లి గ్రామంలో సుమారు 60 ఎకరాలలో వేరుశనగ సాగు ఆవుతుందని ఇక్కడి నేలలు పల్లిసాగు కు అనుకూలమని, రైతులు  వచే సంవత్సరం నుండి ఇంకా అధికసంఖ్యలో పల్లి సాగుకు మొగ్గు చూపాలని వ్యవసాయ అధికారులు రైతులను కోరారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మారాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.

బోర్ల మరమ్మత్తులు చేసి..నీటి బాధలు తీర్చండి..సిపిఐ మహేష్..

 బోర్ల మరమ్మత్తులు చేసి..నీటి బాధలు తీర్చండి..సిపిఐ మహేష్.. 

కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

జగత్గిరిగుట్ట డివిజన్ మక్దుం నగర్లో పాడై పోయిన బోర్లను మరమ్మత్తులు చేయాలని   ప్రజలకు త్రాగునీటి నీటి సమస్యను పరిష్కరంచాలని సిపిఐ ఆధ్వర్యంలో వాటర్ వర్క్స్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.. 2నెలలుగా సంబంధిత అధికారి అమర్నాథ్ దృష్టికి తీసుకెళ్ళినా కాలయాపన చేస్తున్నారని సమస్యను పరిష్కరించడం లేదని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఐడీపీల్ లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ అందుబాటులో లేకపోవడoతో సూపరింటెండెంట్  వినతిపత్రం ఇవ్వడం జరిగిందని సిపిఐ నాయకులు పేర్కొన్నారు  భగత్ సింగ్ మార్గ్ లో బోర్ పాడై చాలా నెలల అయ్యిన విషయాన్ని సంబందిత అధికారులకు తెలియచేసిన కూడా సమస్యను పట్టించుకోకుండా, నిధులు లేవు,మాకు 200 బోర్లు ఉన్నాయి అని తప్పించుకుంటునరే తప్ప పని చెయ్యట్లేదని వెంటనే సమస్యను పరిష్కరించాలని మహేష్ కోరారు.. లేనిపక్షంలో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.. వెంటనే స్పందించిన అధికారులు ఇవ్వాలో, రేపు కచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ అధికారులు హామీ ఇచ్చినట్లు సిపిఐ నాయకులు తెలిపారు.. ఒకవేళ 2 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, మహిళ సమాఖ్య అధ్యక్షురాలు పర్వీనా సుల్తానా,సీపీఐ కార్యవర్గ సభ్యులు నర్సయ్య,వెంకట్ రెడ్డి, సీపీఐ నాయకులు యాకుబ్,ఇమామ్, యాదన్న, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు సెంటర్స్ ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు సెంటర్స్ ప్రారంభం

పెన్   పవర్ ,గొల్లపల్లి

గొల్లపల్లి మండలంలో పిఎసిఎస్ పరిధిలో గల అబ్బాపూర్ గుంజపడుగ అగ్గిమల్ల గంగదేవిపల్లి రాఘవపట్నం రాపల్లి ఇస్రాజ పల్లి,వెనుగుమట్ల గ్రామాలలో ధాన్యం కొనుగోలు సెంటర్స్ ని పీఏసీఎస్ చైర్మన్ రాజసుమన్ రావు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాలలో జడ్పీటీసీ ఎంపీపీ మార్కెట్ కమిటి చైర్మన్ చందోలి పీఏసీఎస్ చైర్మన్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ లు పాల్గొన్నారు 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని  రామన్నగూడెం  కాచికల్ క్రాస్  రోడ్ల  సమీపంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో సమ్మక్క-సారక్క గ్రామైక్య మహిళ సంఘం చే గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ను సర్పంచ్ కాశ మల్ల పద్మ,రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర రెడ్డి  లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ ఆర్ఎస్ఎస్ వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ..దళారీ వ్యవస్థ నిర్మూలనకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి  క్వి.రూ.1888,సాధారణ రకం రూ 1868 చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనంతుల రమేష్ కుమార్ ఏవో నెల కుర్తి రవీందర్రెడ్డి, ఏ పీ ఎం నరేంద్రకుమార్  ఉప సర్పంచ్  కాసం లక్ష్మారెడ్డి, సంఘం అధ్యక్షురాలు వెంకటమ్మ కార్యదర్శి పూలమ్మ  సి ఎ మంజుల సి సి పుల్లయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.


మామిడి, మొక్క జొన్న, కూరగాయల పంటల పై చీడ పురుగుల పై అవగాహన

 మామిడి, మొక్క జొన్న, కూరగాయల పంటల పై చీడ పురుగుల పై అవగాహన

యాదమరి, పెన్ పవర్

గురువారం ఉదయం డి అర్ సి ( జిల్లా వనరుల కేంద్రం) ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖాధికారులు కోనపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలోని నర్రావురు గ్రామంలో మామిడి ,మొక్కజొన్న,కూరగాయల పంటలను సందర్శించి చీడపీడలపైన రైతులకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ దొరసాని , ఆర్ ఏ ఆర్ ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారావు, డి ఆర్ సి, ఏవో పద్మజ, గ్రామ రైతులు, స్థానిక వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ముక్కా లక్ష్మణ్ రావు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ముక్కా లక్ష్మణ్ రావు



పెన్ పవర్ , పెద్ద గూడూరు

మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, ఆ గ్రామ సర్పంచ్ ముక్కా ప్రారంభించారు. రైతులను ఉద్దేశించి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ధాన్యం గింజ ను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కెసిఆర్ గొప్ప ఆలోచన తో రైతులను రాజును చేయడమే లక్ష్యంగా ముందు కు పోతున్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా గా ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి రైతు సెంటర్ కు తీసుకొచ్చే ధాన్యాన్ని తేమ లేకుండా తీసుకురావాలని  రైతులకు తెలియజేశారు. ఈ సమయంలో వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నందు వలన పాలిథిన్ కవర్లు సమకూర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకన్న, ఖాదర్ పాఫా, గజ్జి యాకయ్య, రంజిత్ తదితరులు పాల్గోన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...