నెలకు 2వేలు..25 కిలోల బియ్యం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..
ప్రైవేట్ టీచర్లకు అండగా నిలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం...
స్కూళ్ళు తెరిచే వరకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ...
కుత్బుల్లాపూర్ లో హర్షం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీచర్లు...
ఆపత్కాలంలో మమ్మల్ని ఆదుకున్న సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్న ప్రైవేట్ టీచర్లు...
కుత్బుల్లాపూర్, పెన్ పవర్
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సందర్భంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. స్కూళ్ళు మళ్లీ తెరిచే వరకు నెలకు రూ.2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ తమ సమస్యలు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తో కలిసి తన నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కుటుంబాలకు ఎంతో లబ్ధిచేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యుఎంఆర్ఎస్ఎంఏ అధ్యక్షులు వరప్రసాద్, మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, ముఖ్య సలహాదారులు మండవ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి సీహెచ్ మహేష్ కుమార్, కోశాధికారి జే. దయాకర్, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ మల్లేశం, ఆర్ఎన్ చారి, సీహెచ్ కనక దుర్గారావు, నరసింహులు గౌడ్, ఛాయాదేవి, వనజ, అశోక్ మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment