Followers

ఎండిపోయిన ఏకరం వరి పంటకు 25 వేల నష్టపరిహారం ఇవ్వాలి

 ఎండిపోయిన ఏకరం వరి పంటకు 25 వేలనష్టపరిహారం ఇవ్వాలి

లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్

పంటపోలాలను పరీశీలించిన నాయకులు

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

 రాజన్న సిరిసిల్ల జిల్లా  వీర్నపల్లి మండలంలోనీ  వివిధ తండాల్లో తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎండిపోయిన పంట పోలాలను గురువారం పరీశీలించారు. ఈ సందర్భంగా  లంబాడి హక్కుల పోరాట సమితి  రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్య గజన్ లాల్ నాయక్ మాట్లాడుతూ ఎండిపోయి ఎకరం వరి పంటకు  25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట ఒక వారం రోజుల్లో బోర్లు ఎత్తీపోయి  ఎండిపోయాయనీ  ప్రభుత్వం ఎకరానికి 25 వేలు ఇవ్వాలని రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్య గజన్ లాల్ నాయక్ కోరారు. వీర్నపల్లి మండలంలోనీ పలు తండాలలో తిరుగుతూ తండా లో ఉన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోడు భూములకు పట్టాలు ఈయకపోతే లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు త్వరలోనే పాదయాత్ర చేస్తామని అన్నారు. ఆయనతో పాటు జిల్లా గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయక్. ఉపాధ్యక్షులు లక్ పతి నాయక్. భూపతి నాయక్ . రాజు నాయక్. దేవేందర్ నాయక్ లు పర్యటించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...