Followers

బయట ఆహ్లదకరం - లోపల సమస్యల తాండవం

 బయట ఆహ్లదకరం - లోపల సమస్యల తాండవం


ఫ్యానులు తిరగక ఉక్కపోతతో రోగులు ఉక్కిరిబిక్కిరి

భద్రగిరి సి.హెచ్.సీ లో ఉట్టిపడుతున్న నిర్వహణ లోపం

గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండలంలో ఏకైక సామాజిక ఆరోగ్యకేంద్రం భద్రగిరి ఆరోగ్య కేంద్రం. మండలంలోని 27 పంచాయతీల ప్రజలకు ఆరోగ్య సమస్య వస్తే వైద్యం అందించవలసిన ఆసుపత్రిలో అడుగు పెట్టాలంటే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి .అనారోగ్యముతో వచ్చిన బాధితులకు వైద్యం ఎంత అవసరమో దానితో పాటుగా మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యం. కానీ అటువంటి సదుపాయాలు ఏవి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కానరావడం లేదు.సుమారు 300 మంది వరకు అవుట్ పేషేంట్స్ వస్తూ ఉంటారు. అవుట్ పేషేంట్స్ కన్నా ఆసుపత్రిలో ఉండి వైద్యం తీసుకోవలసిన రోగుల (ఇన్ పేషేంట్స్) పరిస్థితి మాత్రం వర్ణనాతీతం.వార్డు లోకి వెళ్లిన రోగులకు సమస్యలు స్వాగతమిస్తాయి. ప్రతీ వార్డులో ఫ్యానులు ఉన్నా అవి పనిచేయకపోవడంతో రోగులు ఉక్కపోతతో పట్టపగలే చుక్కలు చూస్తున్నారు.
రోగుల పరిస్థితితో పాటు ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు,సిబ్బందికి కూడా ఉక్కపోత తిప్పలు తప్పడం లేదు.వైద్య అధికారి గదిలోని కూడా ఏ.సీ పనిచేయకపోయినప్పటికి వాటి నిర్వహణకు నోచుకోవడం లేదు. ఇన్ని సమస్యలు కంటికి కనిపిస్తున్న ఆ సమస్యలను మాత్రం పట్టించుకోవడంలో అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియడం లేదు.ఆసుపత్రిలో ఇంజెక్షన్లు,డ్రెస్సింగ్స్ చేసే గదులను పరిశీలిస్తే లోపల నిర్వహణ పరిస్థితులు అద్దంపడతాయి. ఆసుపత్రి బయట మొక్కలతో చూడముచ్చటగా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికి లోన మాత్రం సమస్యల ద్వారానికి కేరాఫ్ గా దర్శనమిస్తాయి.ఇంజెక్షన్ రూమ్ పైకప్పు నుండి నీరు కారుతూ ఉన్నా కనీసం మరమ్మత్తులకు నోచుకోని పరిస్థితిలో విధులను ముందుకు నడిపే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారం చూపుతారని ప్రజలు,ఆసుపత్రికి వచ్చిన రోగులు కోరుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...