Followers

దేశానికే దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్

 దేశానికే దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ 

తార్నాక, పెన్ పవర్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి వేడుకలను  నాచారం లో ఘనంగా నిర్వహించారు.  నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్  ఆధ్వర్యంలో నాచారం కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శాంతి మాట్లాడుతూ  దేశానికే దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం వలన అనేక మంది ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లో గ్రేటర్  టిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్,  దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ,  తుంగ  తిరుపతి,  కాటేపల్లి రవీందర్ రెడ్డి, విజయ్ కుమార్, ముత్యం రెడ్డి, గద్ద చైతన్య కిషోర్, భూపాల్ రెడ్డి, మారయ్య, శ్రీనివాస్, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, విట్టల్ యాదవ్,  రామ్ చందర్, హరి ప్రసాద్, అహ్మద్, శ్రీనివాస్, శివ, సాంబశివరావు, శ్రీలత, రాజబాబు, షాహీన్, కట్ట బుచ్చన్న గౌడ్, వేణు, సువర్ణ, సుగుణాకర్ రావు, అజ్మీరా బేగం, రాజు, తిరుమల్, రవీందర్ రెడ్డి, అశోక్, వాసు, రాజేష్ గౌడ్, పాండు,  నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...