Followers

అంబేద్కర్ - జార్జిరెడ్డిల స్పూర్తితో కులోన్మాదం, మతోన్మాదంపై విప్లవిద్దాం

 అంబేద్కర్ - జార్జిరెడ్డిల స్పూర్తితో కులోన్మాదం, మతోన్మాదంపై విప్లవిద్దాం - పీడీఎస్యూ  అధ్యక్షులు డి. రంజిత్. 

తార్నాక ,  పెన్ పవర్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జననం, పీడీఎస్యూ సంస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి మరణం ఒకేరోజు కావడం యాదృచ్ఛికమే. అయినా వారు విభిన్నధృవాలు కాదని, వారి అంతిమ లక్ష్యం సమసమాజమని  పీడీఎస్యూ అధ్యక్షులు డి.రంజిత్ స్పష్టంగా వివరించారు.  పీడీఎస్యూ ఉస్మానియా వర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో  ఆర్ట్స్ కాలేజీ ముందు నూటముప్పయవ అంబేద్కర్ జయంతిని, నలభై తొమ్మిది వ జార్జిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ అధ్యాపకులైనా డాక్టర్  ఇ. ఉపేందర్, డాక్టర్ రమణలు ప్రసంగిస్తూ  భారత కుల వ్యవస్థ రద్దు కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. మతోన్మాద ఆధిపత్యంపై, వారి లంపెన్ విధానాలపై పోరాడుతూ 1972  ఏప్రిల్ 14 న హత్య గావించబడ్డ జార్జిరెడ్డి నిత్య స్ఫూర్తి ప్రధాత అని వివరించారు.  అంబేద్కర్ కులోన్మాదంపైన,  కామ్రేడ్ జార్జిరెడ్డి మతోన్మాద పైన వారివారి మార్గాల్లో ధిక్కరించిన మహాఘనులు అని కీర్తించారు. ఒకే లక్ష్యంతో పని చేసిన విభిన్న బాటసారులైన అంబేద్కర్, జార్జిరెడ్డి స్ఫూర్తితో విప్లవించాలని పిలుపునిచ్చారు.నేటి ప్రభుత్వాలు - కులోన్మాదాన్నీ, మతోన్మాదాన్ని పెంచి పోషించుకుంటూ ప్రయివేటీకరణ లక్ష్యంతో, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తీరును నిలదీయడమే అంబేద్కర్ - జార్జ్ స్మృతిలో నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు ఆర్.ఎన్ శంకర్, పాల్వాయి నగేష్, సనుగుల రంజిత్ తదితరులు ప్రసంగించారు.  పీడీఎస్యూ నేతలు శరన్, మధు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...