Followers

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

 ఘనంగా డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్ జయంతి వేడుకలు...

బేలా,  పెన్ పవర్ 

 భారతరత్న ,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్130వ జయంతి వేడుకలు బుధవారం  మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో  ఘనంగా జరుపుతున్నారు. మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి,చిత్రపటలకు దళిత సంఘాల నాయకులు, ఆయా పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం పంచశీల జెండా ఎగురవేసి, బుద్ధ వందనం ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, అంబేద్కర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు మస్కే తేజ రావ్, స్థానిక సర్పంచ్ వట్టిపల్లి ఇంద్ర శేఖర్ లు మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని దేశ సేవలో ముందుండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడనేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్,టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అద్యక్షులు దేవన్న, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గంభీర్ ఠాక్రే, నిపుంగే సంజయ్,  సులేమాన్, సంజయ్, నానాజీ చారడే, అజయ్, సచిన్, దేవిదాస్, కిరణ్ ముక్క వార్,అంబేద్కర్ యూత్ మండల అధ్యక్షులు కోబ్రాగాడే గజనన్, నాయకులు గౌతమ్, బిక్షన్, మిలింద్,దీపక్,గజానన్,కాంబ్లె గణేష్  , తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...