శ్రీరామ గిరి లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ప్రతి రోజు ఉదయించే ఉదయభాస్కరుడు అంబేద్కర్.
మానవ జాతి అంతా ఒక్కటే అని చూపుడు వేలుతో చెప్పిన దళిత రత్నం.
డి పి వో రఘువరుణ్.
నెల్లికుదురు, పెన్ పవర్
మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలుబుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలు గా జిల్లా పంచాయతీ అధికారి రఘువరుణ్, మండల రెవిన్యూ అధికారి ఆనంతుల రమేష్, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి పాల్గొని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం గ్రామ యువజన సంఘం అధ్యక్షులు మాదరి ప్రశాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అమావాస్య చీకటిని అనగ తొక్కి పూసే వెన్నెలయి బడుగు బలహీన వర్గాల జాతికి వెలుగునిచ్చాడు అని, అంటరానితనము అనే మూడ ఆచారుమును రూపు మాపి మానవ జాతి అంతా ఒక్కటే అని తన చూపుడు వెలుతోనే చెప్పి భారత రాజ్యాంగం రాసిన అక్షర శిల్పి, భారత జాతి దళిత రత్నం, భరతవాణిలో బంగారు మాటలు చెప్పిన ఆశాజ్యోతి అని వారు కొనియాడారు.అంతే గాక ప్రపంచ దేశాలలోని అణగారిన వర్గ ప్రజల కష్టాలను కాశీ,వడపోసి పేదరికం పై ప్రపంచానికే పాఠాలు నేర్పిన మేధావి మరియు లక్షలాది అక్షరాలు రాసుల్లా పోసి చదుకుంటేనే జ్జ్ఞానం, ప్రశ్నించే తత్త్వం,వస్తుందని, దేశం అక్షర అభివృద్ధి చెందుతుందని చెప్పిన అక్షర మేధావి అని .అలాంటి మహానేత కు నివాళులు అర్పించడం మన అదృష్టం అని అన్నారు. ఈ వేడుకలు నిర్వహించిన శ్రీరామగిరి అంబేద్కర్ యువజన సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ డొనికేని జ్యోతి శ్రీనివాస్ గౌడ్, నెల్లికుదురు మండల వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్, శ్రీరామగిరి పి ఏ సి ఎస్ చైర్మన్ జి వెంకన్న, ఐ సి డి ఎస్ సూపర్ వైసర్ గౌసియా,అంబేద్కర్ పెలోషిప్ అవార్డు గ్రహీత డాక్టర్ ఆదూరి కళాదార్ రాజు, పంచాయతీ సెక్రటరీ అంజద్ అలీ, వి ఆర్ ఏ మద్దెల భాస్కర్, వార్డ్ మెంబెర్స్ మద్దెల జయమ్మ, గడీల మంగమ్మ, గ్రామస్తులు డోనికెని శ్రీనివాస్, మల్లయ్య గొల్లపెల్లి ప్రభాకర్, చీమకుర్తి శ్రీనివాస్,పోరండ్ల లక్ష్మయ్య,అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు పులి మురళి,సభ్యులు గాజుల ప్రశాంత్, రాజు,కారం రమేష్, గోడిశాల శ్యామ్, మద్దెల నరేష్, మనోజ్, పల్లెసుందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment