Followers

ప్రపంచమంతటికీ ఆదర్శప్రాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్

 ప్రపంచమంతటికీ ఆదర్శప్రాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్




మందమర్రి , పెన్ పవర్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి భారతరత్న,బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దేశానికే కాక ప్రపంచమంతటికీ ఆదర్శప్రాయుడని మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా సింగరేణి ఎస్సీ, ఎస్టీ నాయకులు, ఉద్యోగులతో కలిసి స్థానిక జిఎం కార్యాలయం నుండి మందమర్రి మార్కెట్ లో గల ఎస్సీ, ఎస్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ పంచశీల జెండా ఆవిష్కరించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు తిరిగి హాజరయ్యారు. జిఎం కార్యాలయంలో ముందుగా  జ్యోతి ప్రజ్వలన గావించి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గొప్ప సంఘ సంస్కర్త అని,తన జీవితాన్ని పీడిత జనోద్ధరణకు కొరకు,తాను నమ్మిన లక్ష్య సాధనకు, చిత్తశుద్ధితో, వీరోచిత పోరాటం సాగించిన సాహసోపేతమైన సత్యవాదిని పేర్కొన్నారు. దేశంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలకు దేవుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి, ఏరియా ఎస్ఓటు జిఎం గోపాల్ సింగ్, పిఎం వరప్రసాద్, ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఎండీ అక్బర్ ఆలీ, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షులు జక్కారెడ్డి, కేకే గ్రూప్ ఏజెంట్ రాంచందర్, శాంతిఖని ఎస్ఓఎం బిక్షమయ్య, ఎస్సీ లైజన్ అధికారి మైత్రేయ బంధు, ఎస్టీ లైజన్ అధికారి మధుసూదన్ రావు, ఎస్సీ సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే తిరుపతి, ఎస్టీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ తిరుపతి, ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఎస్సీ సంఘం ఉపాధ్యక్షులు జి బాపు, యూనియన్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ సంఘం ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...