Followers

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

 ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 



మందమర్రి,  పెన్ పవర్ 

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను బుధవారం మందమర్రి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద  ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పాల్గొన్నారు. ముందుగా పంచశీల జెండాను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆవిష్కరించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్  నల్లాల భాగ్యలక్ష్మి ఓదేలు మాట్లాడుతూ, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నేడు ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు అందుతున్నాయని, అందరు అనుభవిస్తున్న పదవులు, హోదా ఆయనపెట్టిన భిక్ష అని ఆమె పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని, రాబోయే జయంతి వరకు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అందరి సహకారంతో పట్టణంలో  ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్, మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలకు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని  ఆయన తెలిపారు. మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష వాల్ పోస్టర్లు విడుదల చేశారు. అదేవిధంగా తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా కో కన్వీనర్ బచ్చలి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్ ఆధ్వర్యంలో మామిడి గట్టు గ్రామం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బిజెపి దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు మార్తా కుమారస్వామి, నాయకులు రాంటెంకి దుర్గరాజు, గాజుల ప్రతాప్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అన్ని రాజకీయ, కుల, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరస్వామి, జిల్లా కన్వీనర్ నెరువట్ల రాజలింగు, పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు, కో కన్వీనర్లు సకినాల శంకర్,ఎండి ఖలీమ్, నెరువట్ల శ్రీనివాస్, మండల కన్వీనర్లు డబ్ల్యు సురేందర్,ఎండి సలమోద్దీన్, నాయకులు ఉప్పులేటి నరేశ్, జూపాక సంపత్, దాసరి రాజనర్సు, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, వాసాల సంపత్, జూపాక సంపత్, గిన్నారపు రవి, మహిళా నాయకురాళ్లు ఉప్పులేటి గోపిక, ఈశ్వరోజు రజిత, ఉప్పులేటి స్వరలయ  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...