Followers

యావత్ ప్రపంచానికి బాబా సాహేబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత...!

యావత్ ప్రపంచానికి బాబా సాహేబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత...!

మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఒక్కటైన ప్రేమ జంట


లక్షెట్టిపెట్, పెన్ పవర్

ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసి యావత్ ప్రపంచానికి బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అంబేద్కర్ మండల అధ్యక్షుడు దొంత నర్సయ్య అన్నారు.బుధవారం పట్టణంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు వివిధ సంఘాల  నాయకులు ఘనంగా జరుపుకున్నారు.అంబేద్కర్ విజ్ఞగ మందిరం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చప్పుళ్ళు నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా దొంత నర్సయ్య మాట్లాడుతూ ప్రజలందరికి సమాన హక్కులు కల్పించడంలో రాజ్యాంగ రూపకర్త సామాజికవేత్త బాబ్ సాహెబ్ అంబేద్కర్ కృషి ఎంతో ఉందని రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 3 ప్రకారం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకోగలిగామని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కుల మత బేధం లేకుండా ప్రతీ మనిషికి సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం మండలంలోని కొమ్ముగూడెంకి చెందిన ఆకనపల్లి శిల్పాత్తి,మంద జోష్ణ వీరు ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నా ప్రేమ జంట అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పూలమాలలు వేసుకొని ఒక్కటయ్యారు. అనంతరం పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చెర్మాన్ నల్మాస్ కాంత్తయ్య, వైస్ చెర్మాన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చెర్మాన్ తిప్పని లింగన్న, కౌన్సిలర్లు చతరాజు రాజన్న, మెట్టు కల్యాణి రాజు, ఒరగంటి శ్రీకాంత్, వివిధ పార్టీ నాయకులు పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య, నడిమెట్ల రాజన్న, వెంకటస్వామి, చింత అశోక్, హరిగోపాల్ రావు, మధు, ఆయాల్ల విజయ్ కుమార్, ముజ్జు, అంబేద్కర్ సంఘం నాయకులు లింగన్న, చిప్పకుర్తి నారాయణ, లచ్చన్న, చొప్పదండి రమేష్, దుంపల రంజిత్, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...