Followers

ఆర్యభట్ట హై స్కూల్ కరస్పాండెంట్ మధుకర్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.

 ఆర్యభట్ట హై స్కూల్ కరస్పాండెంట్ మధుకర్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.

- పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్.

కే వి పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇస్సంపెల్లి సైదులు.

నెల్లికుదురు , పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్యభట్ట హై స్కూల్ కరస్పాండెంట్ నెలకుర్తి మధుకర్ రెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని KVPS మహబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇసంపేల్లి సైదులు డిమాండ్ చేశారు. తొర్రూరు సూర్య విలేకరి సిరికొండ విక్రమ్ కుమార్ ను ఆర్యభట్ట హైస్కూల్ కరస్పాండెంట్ నెలకుర్తి మధుకర్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించి చంపుతానని ఫోన్లో బెదిరించాడని ఇట్టి విషయం పై అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదని  నెల్లికుదురు మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా రెండవ వేవ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు  కళాశాలలు  తాత్కాలికంగా మూసివేస్తే అట్టి నిబంధనలు తుంగలో తొక్కి ఫీజుల కోసం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుండగా అట్టి విషయాన్ని వాట్సప్ ద్వారా కలెక్టర్ కు సదరు విలేకరి  ఫిర్యాదు చేసినందుకు విలేకరి వృత్తిని అవమాన పరుస్తూ మధుకర్ రెడ్డి దూషించడం ఏమిటని ప్రశ్నించారు. కూటికి లేనివారు విలేకరెంటని అనడంలో ఆంతర్య మేమిటి మండిపడ్డారు. వ్యక్తిగతంగా దూషించి, కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను దూషించడం విద్యాసంస్థల అధినేతకు చెల్లదని అన్నారు. తప్పును ఎండకట్టి నందుకు రౌడీ షీటర్ లా  పాతలారీతో గుద్దించి చంపుతానని బెదిరింపులకు పాల్పడే తీరుపై పోలీస్ అధికారులు  క్రిమినల్ కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్టు చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఏ ఆందోళన కైన సిద్దమే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  కులవివక్ష వ్యతిరేక పొరాట సంఘం మండల అద్యక్షుడు హెచ్ అశోక్ జి.యాకన్న ఎల్లయ్య అషిప్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...