Followers

కోవిడ్ వార్డును పరిశిలించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న

 కోవిడ్ వార్డును పరిశిలించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే  జోగురామన్న... 

బాదితుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా..

వైధ్యారోగ్య అధికారులకు విస్తృత సూచనలు..


ఆదిలాబాద్ ,  పెన్ పవర్

 జిల్లాలో కోవిడ్ కేసులు భారిగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక రిమ్స్ లోని కోవిడ్ వార్డు ను పరిశీలించారు. జిల్లా స్థాయి అధికారులతో ప్రతి నిత్యం సమీక్ష సమావేశాలు చేపడుతూనే వైరస్ కట్టడికి తీసుకోవల్సిన తక్షణ చర్యలపై పలు సూచనలు చేశారు. కోవిడ్ వార్డును స్వయంగా పరిశీలించి బాధితుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. కోవిడ్ సోకిన వారు ఎటువంటి అధైర్యానికి లోను కాకుండా వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలని సూచించారు. బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎటువంటి సమస్యలు తలెత్తినా సంబంధిత అధికారులకు తక్షణమే సమాచారం చేరవేయాలని పేర్కొన్నారు. బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్సలు, ప్రస్తుతం కోవిడ్ వార్డులో చికిత్సలు పొందుతున్న వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారి చేశారు. ఎం.ఎల్.ఏ గారి వెంట రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...