Followers

మట్టి ట్రాక్టర్లు పట్టివేత

 మట్టి ట్రాక్టర్లు పట్టివేత


లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణంలోని ఇటిక్యాల చెరువులో మట్టి నింపుతున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఇరిగేషన్ డీఈ సత్యనారాయణ, ఏఈ గౌతమ్ శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది చెరువును కబ్జా చేసేందుకు మట్టి నింపుతున్నారన్న సమాచారంతో గురువారం రాత్రి సోదా చేయగా సుమారు ఆరు ట్రాక్టర్లు మట్టి పోస్తుండగా పట్టుకున్నామన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపడుతున్నమన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇటిక్యాల చెరువులో గత కొన్ని రోజుల నుండి కొంత మంది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెరువులో మట్టి పోస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఎవరైనా ఇరిగేషన్ భూములు ప్రభుత్వ భూములో నిర్మాణాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు భూములు కొనేటప్పుడు అన్ని వివరాలు తెలుసుకోవాలని, చెరువు భూములు కొని మోసపోవద్దన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...