Followers

వేగా నియంత్రణ చర్యలు పోలీస్ ఆధ్వర్యంలో

 వేగా నియంత్రణ చర్యలు పోలీస్ ఆధ్వర్యంలో 

రెబ్బెన, పెన్ పవర్ 

కొమరంభీమ్  జిల్లా రెబ్బెన మండము పోలీసుల ఆధ్వర్యంలో వేగా నియంత్రణ చర్యలు. ఈ రోజు రెబ్బెన మండల కేంద్రంలో గోలేటిx రోడ్,. తక్కలపల్లి బస్టాప్ వద్ద సింగరేణియాజమాన్యం ఆధ్వర్యంలో సిఐ సతీష్ కుమార్ ఆదేశానుసారం ఎస్ఐ భవానిసేన్  ప్రత్యేక చొరవతో వేగా నియంత్రణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంగా గోలేటిxరోడ్ వద్ద, తక్కపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుకి ఇరువైపులా వేగా నియంత్రణ సంజ్ఞలు, డ్రమ్ములు  ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వారు తెలియజేశారు. వాహనదారులు తాగి వాహనాలు నడపడం వల్ల చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. మద్యం సేవించి, వాహనాలు నడిపితే జరిమనాలతో పాటు, జైలు శిక్ష కూడా విధించబడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ  ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ తప్పని సరిగా పాటించాలని సూచించారు. వాహన దారులు హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌,  అధిక వేగం, మద్యం తాగి నడిపితే జరిగే ప్రమాదాలు, గురించి వివరించారు. మైనర్ బాలురు వాహనాలు నడపరాదన్నారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపరాదు.  రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలన్నారు. వాహనాలు ఓవర్ స్పీడ్ తో, ఓవర్ లోడ్ తో నడపరాదన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...