వనపర్తిని ఆదర్శంగా తీర్చి దిద్దాలి; జిల్లా కలెక్టర్
వనపర్తి, పెన్ పవర్వనపర్తి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. బుధవారం పట్టణంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మునిసిపాలిటీ అభివృద్ధి చెందిందంటే రోడ్లు ఇతర సదుపాయాలు అవసరమని అన్నారు. వనపర్తి లో రోడ్ల విస్తరణ కార్యక్రమంలో ప్రజలు ముందుకు వచ్చి సహకరించాలని ఆమె అభినందించారు. ప్రభుత్వం ఆదర్శ మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయిస్తుందని అన్నారు. ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ యార్డు నిర్మించేందుకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా 60 మంది లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గట్టు యాదవ్, కమిసనర్ మహేశ్వర రెడ్డి, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment