జీడిమెట్లలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
జీడిమెట్ల, పెన్ పవర్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం జీడిమెట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన మహా నేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీరప్ప, అంబేద్కర్ యువజన సంఘం జీడిమెట్ల సభ్యులు బేకు ఆనంద్, బేకు అశోక్, బేకు దశరథ్, ఎం.పూర్ణ చందర్, కాలె నాగేష్, అరుణ్ కుమార్, బేకు నరహరి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment