Followers

రాజ్యాంగ నేత అంబేద్కర్ కు శతకోటి నివాళులు

 రాజ్యాంగ నేత అంబేద్కర్ కు శతకోటి నివాళులు.. 

అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా పని చేద్దాం..ఎమ్మెల్యే కేపి వివేకానంద్..




కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం రాజీవ్ గృహకల్పలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను జై భీమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు.. ఈఉత్సవాల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా తమాంతా నడుచుకోవాలని సూచించారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలవారికి పెద్ద పీఠ వేశారన్నారు. రాజకీయాలలో కూడా అణగారిన వర్గాల వారికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు, బలహీన వర్గాలవారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఏ విధంగా సమసమాజ నిర్మాణం జరగాలని అంబేద్కర్‌ ఆశించారో.. ఆసమాజాన్ని నిర్మించే దిశగా, అంబేద్కర్ సూచించిన దిశలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని కే.పీ.వివేకానంద పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగారావు, నాయకులు వెంకటస్వామి, యూసుఫ్, రాజ్ కుమార్, ప్రభాకర్, రామారావు, తారా సింగ్, శివా గౌడ్, నగేష్ రెడ్డి, రాజీవ్ గృహకల్ప జై భీమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఘ్నేష్, వైస్ ప్రెసిడెంట్ ఎన్ సత్యనారాయణ, జెనరల్ సెక్రెటరీ డి. నర్సింహా రావు, చైర్మన్ లు బాల్ రాజు, నర్సింహా మూర్తి, జాయింట్ సెక్రటరీ చిట్టి రాజు, ట్రెజర్ జి వి సత్యనారాయణ, ఎక్జిక్యూటివ్ మెంబర్స్ ఎన్.భాస్కర్, ఎన్. సత్యనారాయణ, డి.సత్యనారాయణ, సి.హెచ్.ఆనంద్, మహిళా నాయకురాలు దేవి, మంగ, శ్యామలు, జయమ్మ, వరలక్ష్మి, సత్యవాణి, మహాలక్ష్మీ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...