Followers

రాజ్యాంగ సృష్టికర్తకు ఘనంగా జన్మదిన వేడుకలు

 రాజ్యాంగ సృష్టికర్తకు ఘనంగా జన్మదిన వేడుకలు.. 

అంబేద్కర్ కు మాలవేసి నివాళులు అర్పించిన దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ పద్మారావు.. 

బహుదూర్ పల్లి 13వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ అంబేద్కర్ కు ఘన నివాళులు.. 

పలువురు కౌన్సిలర్లు.. టిఆర్ఎస్ నాయకులు.. మహనీయినికి పూల అభిషేకం.. 

నవనిర్మాణం..బలహీన వర్గాల కోసం పాటుపడిన.. స్వాతంత్ర్య యోదుడు అంబేద్కర్: తుడుము పద్మారావు.. 





దుండిగల్, పెన్ పవర్ 

రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 130వ జయంతి వేడుకలలో దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ తుడుము పద్మారావు మరియు 13వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ పాల్గొని రాజ్యాంగ నేతకు నివాళులు అర్పించారు. వైస్ చైర్మెన్ పద్మారావు, కౌన్సిలర్ సత్యనారాయణ అంబేద్కర్ కు పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.. రెండు నిమిషాలపాటు మౌనం పాటించి అనంతరం ఆ మహనీయుని గురించి ప్రసంగించారు. పద్మారావు మాట్లాడుతూ.. భీంరావ్ రాంజీ అంబేద్కర్.. బీఆర్ అంబేద్కర్ గా అందరికీ పరిచయమైన భరత మాత ముద్దుబిడ్డ అని, అంబేద్కర్ 1891వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన జన్మించాడని, భారతదేశానికి స్వతంత్రం కోసం చేసిన పోరాటంలో పాల్గొన్న వారిలో అంబేద్కర్ ఒకరని, భారత దేశానికి రాజ్యాంగాన్ని రాసిన వీరుడు అంబేద్కర్‌ అంటూ వైస్ చైర్మెన్ పద్మారావు కొనియాడారు.. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసిన అంబేద్కర్, ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నీ పరిశీలించి, మన దేశంలోని పరిస్థితులకి అవి ఎలా సరిపోతాయో చూసుకొని, అన్ని వర్గాలవారికి సరితూగే విధంగా, ఇంకా ఏమేం అవసరం ఉంటాయని విశ్లేషించుకుని సుదీర్ఘ రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించాడని పద్మారావు, కౌన్సిలర్ సత్యనారాయణ పేర్కొన్నారు..దళితుడిగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని చదువుతో ఆ అవమానాలను సత్కారాలుగా మార్చుకుని ఎందరో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాడని, భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసాడని అన్నారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భరత్ కుమార్, సుజాత వెంకటేష్,నవనీత మల్లేష్, అంబేద్కర్ సంగం నాయకులు టి.ఈశ్వర్, బి. ఈశ్వర, వినోద్, కిషన్ రావు, రాహుల్, శ్రీరాములు,  ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...