Followers

ఘనంగా అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు

 ఘనంగా అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల ,  పెన్ పవర్

 అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగావేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో గుడి ముందు గల అంబేద్కర్ విగ్రహానికి, తిప్పాపూర్ జంక్షన్ లోని అంబేద్కర్ విగ్రహానికి మరియు శత్రాజ్ పల్లి లోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం లోని అన్ని వర్గాల వారికి ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమన్యాయం కోసం అతి పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి శ్రీ  అంబేద్కర్ గారని, కుల వివక్ష వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువు ఓ తపస్సుగా భావించి చదువుకు కులం అడ్డు కాదని నిరూపించిన వ్యక్తి  అంబేద్కర్ అని, కొన్ని కోట్ల మంది జనాలకు స్ఫూర్తిదాయకమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్యామ్ సుందర్ రావు , మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు  ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘం నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...