Followers

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయం

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయం

యువత అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని అల్మాస్ పూర్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని, అనగారిన వర్గాల అభివృధి కోసం ఎంతో కృషి చేశారని, బలహీన వర్గాల ప్రజలు తల ఎత్తుకొని,రొమ్ము విరుచుకుని బ్రతుకుతున్నారు అంటే అది అంబేద్కర్ చేసిన కృషి ఫలితమే... అఖండ భారత దేశానికి ఒక రాజ్యాంగం కావాలని  దృఢసంకల్పంతో రాజ్యాంగాన్ని లిఖించి అన్ని వర్గాల  ప్రజల మన్ననలు పొందిన గొప్ప ఘనుడు అంబేద్కర్.. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటన్నిటికీ భిన్నంగా దేశ ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో భగవత్ గీత తో సమానం అయినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని లిఖించిన గొప్ప మేధావి అంబేద్కర్..కానీ కొందరు అంబేద్కర్ ను ఒక వర్గానికి సంబందించిన వ్యక్తిగానే చూస్తున్నారు..అంబేద్కర్ ఒక వర్గానికో, కులనికో సంబందించిన వ్యక్తి కాదు.. పూర్తి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి అందరి మన్నలను పొందిన వ్యక్తి..ఈ జయంతి వేడుకలలో బీజేపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...