వెటర్నరీ అసిస్టెంట్లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
పెన్ పవర్, కరపపశుసంవర్ధక అసిస్టెంట్లకు ఏర్పాటుచేసిన శిక్షణ ద్వారా మెళుకువలను అవగాహన చేసుకుని, గ్రామీణ ప్రాంతంలోని పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని ఆశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎన్టీ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పశువైద్యశాలలో సోమవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు ఏర్పాటుచేసిన 4 నెలల శిక్షణాకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఈ క్షణాకార్యక్రమాన్ని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ సంచాలకులు డాక్టర్ అమరేంద్రకుమార్ పర్చువల్ విధానంలో ప్రారంభించారు. శిక్షణాకార్యక్రమంలో పశుసంవర్ధక సహాయకులకు ప్రాధమిక పశువైద్యం, కృత్రిమ గర్భధారణ, పశువుల్లో వచ్చే వ్యాధులు, వాటినివారణ చర్యలపై అనుసరించాల్సిన విధి విధానాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జేడీ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరప సబ్ డివిజన్ ఏడీ డాక్టర్ ఎస్ ఎస్ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతీరోజూ ఉదయం శిక్షణలో పాల్గొని, మధ్యాహ్నంపూట తమ రైతు భరోసా కేంద్రాలలో విధులకు హాజరుకావాలన్నారు. ప్రతీ సోమవారం నైపుణ్య, విషయ పరిజ్ఞాన పరీక్షలు ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మెటర్నరీ అసిస్టెంట్లను సర్వీసుల రెగ్యులర్ చేయడం ఇరుగుతుందన్నారు. శిక్షణ పొందిన ఏహెచ్ఐలు రైతులకు ఉత్తమ సేవలందించాలన్నారు. కరప కాకినాడ రూరల్ మండలాల పశువైద్యాధికారులు డాక్టర్ పీవీ రంజిత్ సింగ్, డాక్టర్ ఎన్వీ శివప్రసాద్, డాక్టర్ పి.అనిల్ విల్సన్, డాక్టర్ ఎం. రాజలక్ష్మి, డాక్టర్ టీవీ సురేష్., సీహెచ్ కేవీ ప్రసాదరావు పాల్గొన్నారు.

No comments:
Post a Comment